ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు వాడే సోషల్ మీడియా ఫేస్‌బుక్ తన ప్రధాన యాప్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో 1,259 ఖాతాలు, పేజీలు, గ్రూపులను సెప్టెంబర్‌లో తొలగించింది. ఇరాన్‌లో ముఖ్యంగా ఆ దేశంలోని లోరెస్టన్‌లోని దేశీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న 93 ఫేస్‌బుక్ ఖాతాలు, 14 పేజీలు, 15 గ్రూపులు, 194 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను తొలగించింది. కంపెనీ ఒక ప్రకటనలో "ఈ ప్రాంతంలో అనుమానాస్పద సమన్వయంతో కూడిన అసహజ ప్రవర్తనపై మా అంతర్గత దర్యాప్తులో భాగంగా ఈ కార్యకలాపాన్ని మేము కనుగొన్నాము. ఇస్లామిక్ విప్లవ గార్డ్ కార్ప్స్‌తో అనుబంధించబడిన వ్యక్తులతో ముడిపడిన వారి ఖాతాలు తొలగించాము" అని చెప్పుకొచ్చింది.

సెప్టెంబర్‌లో ఫేస్‌బుక్ సూడాన్, ఇరాన్ నుండి రెండు నెట్‌వర్క్‌లను తొలగించింది. రెండు నెట్‌వర్క్‌లు ఏదో ఒకవిధంగా ఆయా దేశాల సైనిక సంస్థలతో అనుసంధానం చేయబడ్డాయి. ప్రతి ఒక్కరు మిలిటరీని ప్రశంసిస్తూ, వ్యతిరేక వర్గాలను విమర్శించడానికి దేశీయ జనాభాను లక్ష్యంగా చేసుకున్నారు. "ఇరాన్‌లో మేము అంతరాయం కలిగించిన మొట్టమొదటి కన్వర్ట్-ఎఫెక్ట్ ఆపరేషన్ ఇది. ఇది పూర్తిగా దేశం లోపల కేంద్రీకృతమై ఉంది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో అనుబంధించబడిన వ్యక్తులచే నిర్వహించబడుతుంది" అని ఫేస్‌బుక్ తెలిపింది.

సూడాన్‌లో, ఫేస్‌బుక్ 116 పేజీలు, 666 ఫేస్‌బుక్ ఖాతాలు, 69 గ్రూపులు మరియు 92 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను తొలగించింది. "సుడానీస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న పారామిలిటరీ గ్రూపు అయిన సుడానీస్ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్‌తో లింక్ చేశాము" అని కంపెనీ తెలిపింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ సెప్టెంబర్‌లో వినియోగదారుల భద్రతను మరింత పెంచడానికి నిరంతరం పని చేస్తోందని, ఈ ప్రాంతానికి ఫిక్స్ టీమ్‌లు, టెక్నాలజీపై 2016 నుండి $ 13 బిలియన్లకు పైగా పెట్టుబడి పెట్టిందని చెప్పారు. ఈ సంవత్సరం మొదటి 6 నెలల్లో మూడు బిలియన్ నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలను మూసివేసినట్లు సోషల్ మీడియా సంస్థ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: