దేశం లో ప్రస్తుతం 4G  ని విరివిగా వాడుతున్నారు. అయితే దేశం లో ప్రస్తుతం 5g కోసం ఎదురు చూస్తున్నప్పటికీ 6G ఫీచర్లు వింటే ఈ టెక్నాలజీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని అనిపిస్తుంది.  మనదేశం లో 5g రాకముందే 6G ని మొదలుపెట్టాలని కేంద్ర  ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ పరిధిలోని టెలికామ్ పరిశోధన మరియు  అభివృద్ధి సంస్థ (సీ-డీఓటీ) ఈ 6G ఇంకా ఇంకా ఇతర టెక్నాలజీలపై సాధ్యమైనంత త్వరగా పనులు ప్రాంభించాలంటూ టెలికాం కార్యదర్శి కె రాజరామన్ ఆదేశించారు. 6G టెక్నాలజీ పై దిగ్గజ సంస్థ లైనటువంటి శామ్ సంగ్, హువావే, ఎల్‌జీ లు మరియు ఇతర కంపెనీ లు ఇప్పటికే ప్రయోగాలు ప్రారంభించాయి.

IHG




మనదేశం లో 5g సేవలు వచ్చే సంవత్సరానికల్లా అందు బాటులోకి రానున్నాయి. అయితే దేశం లో 6G పై పలు సంస్థలు ప్రయోగాలు కూడా మొదలు పెట్టాయి. ప్రస్తుత 4G డౌన్లోడ్ స్పీడ్ 10 జిబిపిఎస్ ఉండగా రానున్న 5g స్పీడ్ మాత్రం 20 జిబిపిఎస్ ఉంది , అప్లోడ్ స్పీడ్ మాత్రం 3.7  జిబిపిఎస్ ఉంది. జియో ,వీఐ,  ఎయిర్ టెల్ కంపెనీలు 5జీ నెట్‌వర్క్ ట్రయల్స్‌లో 3 జీబీపీఎస్ డౌన్‌లోడ్ వేగాన్ని నమోదు చేశాయని తెలుస్తోంది.ఈ సందర్భం లో చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే 6G స్పీడ్  5G మీద  50 రేట్లు  అధిక స్పీడ్ ని కలిగి ఉండనుంది. అంటే 6G  స్పీడ్  1000 జిబిపిఎస్ లు.

IHG




 ఫైల్ ట్రాన్స్ఫర్ రేంజ్ 100 మీటర్స్ అంటే ఒక మూవీని 56 సెకనులలో డౌన్లోడ్ చేయవచ్చు , అంటే  6 జీబీ మూవీని ని కేవలం 56 సెకనులలో ఇతరులకు పంపవచ్చు. అదే స్పీడ్  తో తిరిగి రిసీవ్ చేసుకోవచ్చు .అందుతున్న సమాచారం ప్రకారం ఈ టెక్నాలజీ 2028 -2030 లో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే  శామ్ సంగ్, హువావే, ఎల్‌జీ వంటి దిగ్గజ సంస్థలు ఇతర దేశాలలో అనగా అమెరికా వంటి దేశాలలో  ప్రయోగాలు చేసాయి . 6G టెక్నాలజీ ని మొదట జపాన్ ప్రయోగాత్మకం గా లాంచ్ చేయాలనుకుంటుంది. ఆ తరువాత చైనా , దక్షిణ కొరియా, ఫిన్లాండ్ లు వరుసగా లాంచ్ చేయాలనుకుంటున్నాయి . వీరితో పాటుగా ఏకకాలం  లో  భారత్  లాంచ్ చేయాలనీ భావిస్తోంది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి:

6G