ఈ మధ్యకాలంలో ఎన్నో ఓటిటీ ఫ్లాట్ ఫోర్మ్స్ వచ్చిన.. టెలివిజన్ ప్రసారం మాత్రం అంతం కాదు. అంతే కాకుండా ఈ మధ్యకాలంలో సాటిలైట్స్ ఛానల్ హవా కూడా బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు వారికి నచ్చిన విధంగా వారికి నచ్చిన ఛానల్ చూస్తున్నారు. సీజన్ బట్టి ఛానళ్లను చూస్తూ ఉంటారు కొందరు. ఇక అలా క్రికెట్ సీజన్ వచ్చినప్పుడు క్రికెట్ ను చూసేటప్పుడు టీవీ స్క్రీన్ మీద కొన్ని విభిన్నమైన అంకెలు, కనిపిస్తూ ఉంటాయి. వాటి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే వాటి వివరాలను తెలుసుకుందాం.


మనకి టెలివిజన్ ప్రసారమయ్యేది కేవలం సెటప్ బాక్స్ ల ద్వారానే.ఆ బాక్సులు నెంబర్స్ అన్ని వేరువేరుగా ఉంటాయి. అందుచేతనే టీవీ స్క్రీన్పై కనిపించే నెంబర్లు కూడా వేరు వేరుగానే ఉంటాయి. దీనిని VC నెంబర్ అని కూడా అంటారు. నిజానికి ఈ నెంబర్ ను టీవీ ల పై చూపించడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందట

ప్రజలు టీవీ లో ప్రసారమయ్యేటువంటి కంటెంట్ , ఏదైనా ప్రోగ్రాంలను, దొంగలించకుండా, వాటిని యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్లోడ్ చేయకుండా, ఫేస్బుక్ వంటి వాటిలో క్రికెట్ లైవ్ మ్యాచ్ ను రికార్డ్ చేసి అందులో పోస్ట్ చేశారు అంటే.. ఇవన్నీ పైరసీ కిందికి వస్తాయి. అందుచేతనే వారు మనల్ని గుర్తించేందుకు ఆ ప్రత్యేకమైన సంఖ్యను ఏర్పాటు చేసినట్లు సమాచారం.

ఆ ఐడి నెంబర్ మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది కాబట్టి ఇందులో మన డేటా అంత ఉంటుంది. అప్పుడు మనం రికార్డ్ చేసిన వెంటనే అందులో ఈ నెంబర్ కనిపిస్తుంది తద్వారా వారు ఆ నెంబర్ సహాయంతో తో ఆ కస్టమర్ ఎవరు గుర్తిస్తారు. అప్పుడు ఫైరసీ ఎక్కడ జరుగుతోందో వారు గుర్తించడానికి సులువుగా ఉండేందుకు ఈ నెంబర్ ని స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేస్తారట. ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువగా పైరసీలు కావడం వల్ల ఇలాంటి సదుపాయాన్ని కనుగొన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: