ఇన్ఫినిక్స్ మొబైల్ కంపెనీ ఇన్ఫినిక్స్ నోట్ సిరీస్ కింద నోట్ 11, నోట్ 11 ప్రో అనే రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ ఫోన్ల డిజైన్ చాలా ఆకర్షణీయంగా, వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. అలాగే యూజర్లు ఈ ఫోన్లలో 2TB మైక్రో SD కార్డ్ వరకు ఉంచవచ్చు. అలాగే ర్యామ్ పెంచుకోవచ్చు. ఇన్ఫినిక్స్ నోట్ 11, నోట్ 11 ప్రో ధర వెల్లడించలేదు. కానీ వాటి వేరియంట్ల గురించి సమాచారం అందింది. నోట్ 11 స్మార్ట్‌ఫోన్ గ్రీన్, గ్రాఫైట్ బ్లాక్ రంగులలో వస్తుంది. నోట్ 11 ప్రో హేజ్ గ్రీన్, మిస్ట్ బ్లూ, మిథ్రిల్ గ్రే కలర్ ఆప్షన్లలో వస్తుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 11, నోట్ 11 ప్రో స్పెసిఫికేషన్‌లు
ఇన్ఫినిక్స్ నోట్ 11 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో MediaTek Helio G96 ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది 8 GB ram తో వస్తుంది. యూజర్లు 128 GB UFS 2.2 స్టోరేజ్‌ ఉంటుంది. 2TB వరకు మైక్రో SD కార్డ్‌ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ర్యామ్ పెంచుకునే ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది ర్యామ్‌ను 8 GB నుంచి 11 GB వరకు పెంచడానికి సహాయపడుతుంది. ఈ పరికరంలో గ్రాఫిన్ ఫిల్మ్ ఉపగించడంతో, చిప్‌సెట్‌ను చల్లగా ఉంచడంలో సహాయ పడుతుంది.
 
ఇన్‌ఫినిక్స్ నోట్ 11 ప్రో ఫుల్‌ హెచ్‌డి ప్లస్ ఐపిఎస్ ఎల్‌సిడి ప్యానెల్ 6.95 అంగుళాలు ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేటును కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే TUV Rheinland సర్టిఫికెట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 5000 mAh బ్యాటరీ ఉంది. దీనికి ఛార్జింగ్ కోసం 33W ఫాస్ట్ ఛార్జర్‌ వస్తుంది.

కెమెరా సెటప్ విషయానికొస్తే , ఇన్‌ఫినిక్స్ నోట్ 11 ప్రో వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. అయితే 13 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంది. ఇది 30 ఎక్స్ డిజిటల్ జూమ్‌తో వస్తుంది. అలాగే ఇది 2 మెగాపిక్సెల్స్ సెన్సార్‌ తో పాటు సెల్ఫీ, వీడియో కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇన్ఫినిక్స్ నోట్ 11 స్పెసిఫికేషన్ లు కూడా ఇన్‌ఫినిమరో రెండవ కెమెరా 2 మెగాపిక్సెల్ లెన్స్ తో వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: