ఇండియన్ మార్కెట్లో సరికొత్త నాయి సెన్స్ ను ప్రారంభించింది నాయిస్ నెక్ బ్యాండ్. ఇందులో రెండు రకాలుగా వీటిని తయారుచేసింది. ఇక ఇన్ కమింగ్ కాల్స్ కోసం ఒక అలర్ట్ వచ్చేలా ఒక ఆప్షన్ తో మన ముందుకు వచ్చింది. ఎటువంటి గాలి వచ్చిన, దుమ్ము ధూళి వచ్చిన స్పష్టంగా వినిపించే విధంగా ఈ నెక్ బ్యాండ్ ను  తయారు చేశారు.ఇక అంతేకాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా అందించనుంది.

ఈ నాయిస్ సెన్స్ ధర 2,499 రూపాయల కగా , వీటిని ప్రత్యేకమైన ఆఫర్ కి రూ.1,100 రూపాయలకి మనకు అందించనుంది. కానీ ఈ ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుందో కంపెనీ తెలియజేయలేదు. ఈ నాయిస్  సెన్స్ బ్లూ, బ్లాక్ రెండు కలర్ లో మనకి లభిస్తుంది. ఇది మనకి అమెజాన్ వెబ్ సైట్ లో దొరుకుతుంది. అయితే ఈ నాయిస్ బ్యాండ్ యొక్క స్పెషల్ ఏంటో చూద్దాం.

నాయిస్ సెన్స్ ప్రకారం 10 మీటర్ల దూరం వరకు పనిచేస్తుంది. అంతేకాకుండా కాలింగ్ కోసం ఒక సరికొత్త ఫీచర్లతో మైకును ఇందులో అమర్చింది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఈ నెక్ బ్యాండ్ స్పెషల్ గా కాల్ రిజెక్ట్, వాల్యూమ్ కంట్రోల్, టచ్చు సపోర్టుతో కలదు.ఇక ఇందులో ఒక ఫిజికల్ బటన్ కూడా ఉండదు.

ఇక ఈ నాయిస్ నెక్ బ్యాండ్ కేవలం ఎనిమిది నిమిషాలు చార్జింగ్ చేస్తే చాలు.. ఎనిమిది గంటలపాటు నిరంతరం మాట్లాడుతూ ఉండవచ్చు. ఇక ఈ నెక్ బ్యాండ్ లో రెండు మ్యాగ్నెటిక్ ఉండటం వల్ల మనం ఉపయోగించనపుడు అవి రెండూ కలిసి ఉంటాయి. ఇక అంతే కాకుండా ఈ నాయిస్ గూగుల్ అసిస్టెంట్ తో కూడా పనిచేస్తుంది.ఇది ఒకేసారి రెండు మొబైల్స్,MP3 కీ ఉపయోగించుకోవచ్చు. ఛార్జింగ్ కేబుల్ USB టైప్స్ -C పోర్టును కలిగి ఉంటుంది. ఈ నాయిస్ యొక్క బరువు 30 గ్రాములు కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: