కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటీ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రీఛార్జి ప్లాన్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యులు రీఛార్జ్ చేసుకోలేని పరిస్థితులను కూడా ఎదుర్కొని, తక్కువ రీఛార్జ్ ప్లాన్ లు వస్తే బాగుంటుంది అంటూ తెగ ఆలోచిస్తున్నారు. ఇక అలాంటి వారి కోసమే ఎయిర్టెల్, జియో, వి ఐ తదితర టెలికాం సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లను ప్రకటిస్తూ పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు కంపెనీలు ఏకంగా 200 రూపాయలకే అతి తక్కువ ధరకే లభించే అన్లిమిటెడ్ ప్లాన్స్ ను కూడా అందిస్తున్నాయి అయితే వీటి వివరాలను కూడా మనం తెలుసుకుందాం.


1. బిఎస్ఎన్ఎల్:
బిఎస్ఎన్ఎల్ అందిస్తోన్న అతి తక్కువ ప్రీపెయిడ్ ప్లాన్ మనకు ఒక నెల వరకు అందించనుంది. రూ.187 విలువ కలిగిన ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా అపరిమిత కాల్స్, ప్రతి రోజూ 2 జీబీ డేటా, రోజుకు వంద ఎస్ఎంఎస్లను అందిస్తోంది. ఇక ఇరవై ఎనిమిది రోజుల పాటు ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఉంటుంది.

2. ఎయిర్టెల్:
రూ.199 విలువ కలిగిన ఈ ప్లాన్ మనకు 24 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. అపరిమిత కాలింగ్ కలిగి ఉన్న ఈ ప్లాన్ ద్వారా రోజుకు వన్ జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లను మనం పొందవచ్చు. ఉచితంగా అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, ఉచిత హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్, ఎయిర్టెల్ ఎక్స్ ట్రీమ్ కి కూడా యాక్సేస్ లభిస్తుంది.

3. జియో:
రూ.199 విలువ గలిగిన ఈ ప్లాన్ మనకు 28 రోజుల పాటు వ్యాలిడిటీ ని కలిగి ఉంటుంది. ప్రతి రోజూ 1.5 gb డేటా, అన్లిమిటెడ్ కాల్స్ తో పాటు ప్రతిరోజూ వంద ఎస్ఎంఎస్లను పొందవచ్చు. అంతే కాదు జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో టీవీ ,జియో న్యూస్ , జియో క్లౌడ్ తో సహా అన్ని జియో అప్లికేషన్లకు కూడా మనం సబ్స్క్రిప్షన్ పొందవచ్చు.

4. వీ. ఐ:
రూ.199 ప్లాన్ తో అన్లిమిటెడ్ కాల్స్ తో పాటు ప్రతి రోజు వన్ జీబీ డేటా ,ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లను  పొందవచ్చు. 24 రోజుల పాటు ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్ తో విఐ సినిమాలు అలాగే టీవీ ఒరిజినల్ ఖాతాలకు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: