ఇటీవల కాలంలో మెసేజింగ్ యాప్ ల వాడకం ఎక్కువైంది. ఈ యాప్ లలో రకరకాల ట్రిక్స్ ఉపయోగించి ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ రోజుల్లో సైబర్ మోసాలకు వాట్సప్ కూడా ఒక వేదికగా మారిపోయింది. ఇటీవల వాట్సప్ లో జరుగుతున్న మోసాలు సైబర్ నేరగాళ్లు బాధితుల కుటుంబ సభ్యులకు నటించి మోసం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఫేక్ మెసేజ్ లు సెండ్ చేస్తూ టార్గెట్ చేస్తున్నారని, కాబట్టి వాట్సప్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని యూకే ఆధారిత ప్రభుత్వ సంస్థ సఫోల్క్ ట్రేడింగ్ స్టాండర్డ్స్ హెచ్చరించింది. 

ఇటీవల జరిగిన ఓ ఘటన లో ఓ మహిళకు కూతురిగా పేర్కొంటూ గుర్తు తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ సందేశం వచ్చింది. ఆ సందేశంలో ఏముందంటే అమ్మాయి టాయిలెట్ లో పడిపోయిందని, ఇది నా కొత్త కాంటాక్ట్ నెంబర్ అని అతను నమ్మించారు మోసగాళ్లు. అయితే బిల్లులు చెల్లించాల్సి ఉందని, ఆ తల్లిని డబ్బులు చెల్లించమని అభ్యర్థించారు. అయితే అదృష్టవశాత్తు ఆమె వాళ్ళ మాటలు విని మోసపోలేదు. పైగా ఇతర మార్గాలు తన కుమార్తెను సంప్రదించి అసలు విషయం ఏంటో తెలుసుకుంది. కౌన్సిల్ ప్రకారం ప్రతి సంవత్సరం యూకేలో జరుగుతున్న స్క్రీన్లలో ఐదు నుండి పది మిలియన్ల వరకు నష్ట పోతున్నట్టు అంచనా. ఈ స్కామ్ లు ఫోన్ కాల్స్, ఉత్తరాలు, ఈ మెయిల్స్, ఇంటర్నెట్ లేదా ఇంటివద్ద కూడా జరిగే అవకాశం ఉంటుంది.
 
వాట్సాప్ స్కామ్ ను గుర్తించడం ఎలా?
సార్ మీ కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు గా నటించే అవకాశం ఉంటుంది. వాళ్లు మీ అధిక వివరాలను పొందడానికి ప్రయత్నిస్తారు. మీపై ఒత్తిడి పడేలా చేసి మీ మధ్య జరిగిన సంభాషణ రహస్యంగా ఉంచమని కూడా అడిగే అవకాశం ఉంటుంది.

స్కామ్ నుంచి బయట పడాలి అంటే?
అవతలివాళ్ళు మీ స్నేహితులు కాదా అనే విషయాన్ని నిర్ధారించుకోండి. ఆ వ్యక్తి నిజంగా మీ సన్నిహితుడా లేదా అని తెలుసుకోవడానికి టెక్స్ట్ చేసే విధానాన్ని అర్థం చేసుకోండి. ఓటిపి ని అస్సలు షేర్ చేయొద్దు. బ్యాంకు ఉద్యోగులు అయినప్పటికీ మీ బ్యాంకు ఖాతా వివరాలను షేర్ చేయొద్దు. అది కనిపిస్తే వెంటనే బ్యాంకు తెలియజేయండి. ఏదైనా యాప్ వాడుతుంటే సెట్టింగ్స్లోకి వెళ్లి హెల్ప్ క్లిక్ చేసి వాళ్ల సహాయాన్ని తీసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: