మీరు ట్విట్టర్ వాడుతున్నారా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకే. ఇప్పుడు ట్వీట్ చేస్తూ కూడా డబ్బులు సంపాదించే అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది ట్విట్టర్. ట్విట్టర్‌లో పోస్ట్‌లు మాత్రమే షేర్ చేస్తామని, లేదా రీట్వీట్ చేస్తారని ఆలోచిస్తున్నారా? కానీ ఇప్పుడు అలా ఆలోచించే వారి ఆలోచనలను మార్చడానికి, ఎక్కవ మంది వినియోగదారులను సంపాదించుకోవడానికి ఈ ప్లాట్‌ఫామ్ డబ్బు సంపాదించే కొత్త ఫీచర్ ను తీసుకురాబోతోంది. ట్విట్టర్ కేవలం మైక్రోబ్లాగింగ్ సైట్ మాత్రమే కాదు అంతకంటే ఎంతో ఎక్కువ. ఇప్పుడు జనాలు బయట కంటే ట్విట్టర్ ద్వారానే ప్రపంచంలో ఏం జరుగుతుంది అనే విషయాలను తెలుసుకుంటున్నారు. రాజకీయ నాయకులు, విశ్లేషకులతో పాటు ఎంతోమంది కంటెంట్ క్రియేటర్స్ ప్రపంచంలోని నలుమూలలా జరిగే విషయాలను వినియోగరుల కోసం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలా ఎవరి కంటెంట్ అయినా నచ్చిందంటే ఏం చేస్తాం? కామెంట్లలోకి వెళ్లి అభినందిస్తాము. లేదా లైక్ చేస్తాం. కానీ ఇప్పుడు మీరు ఎవరి పనిని నిజంగా ఇష్టపడితే వారికి 'టిప్స్' ఇవ్వవచ్చు. ట్విట్టర్ 'టిప్స్' అనే కొత్త ఫీచర్‌ని తీసుకొస్తోంది. iOS వినియోగదారుల కోసం పరిమిత బేస్‌తో ట్విట్టర్ ఈ ఫీచర్ ను రూపొందించింది. కానీ ఇప్పుడు ఆండ్రాయిడ్ వినియోగదారులు కూడా దీన్ని ఉపయోగించవచ్చు.

ట్విట్టర్ 'టిప్స్' ఫీచర్‌తో ఆన్‌లైన్‌లో డబ్బును బదిలీ చేయవచ్చు
ట్విట్టర్ 'టిప్స్' ఫీచర్ ద్వారా ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేయడానికి, స్వీకరించడానికి, క్రిప్టోకరెన్సీలో కూడా పేమెంట్ చేయొచ్చు. ట్విట్టర్ ప్రొఫైల్ పేజీలో ఫాలో బటన్ పక్కనే 'టిప్స్' బటన్ ఉంటుంది. ఈ ట్విట్టర్ 'టిప్స్' Razorpay, Wealthsimple Cash, Venmo, Bandcamp, CashApp, Chipper, Patreon వంటి ఆన్లైన్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పని చేస్తుంది.

ట్విట్టర్ 'టిప్స్' ఎలా ఉపయోగించాలంటే?
ట్విట్టర్ లో ప్రొఫైల్‌ ఓపెన్ చేయండి. 'ఎడిట్ ప్రొఫైల్‌'పై క్లిక్ చేసి 'టిప్స్' క్రిందికి స్క్రోల్ చేయండి. దానిపై క్లిక్ చేసి, 'జనరల్ టిప్పింగ్ పాలసి'ని క్లిక్ చేయండి. అనంతరం 'అలౌ' కొట్టి మీ పేరుతో మూడవ పేమెంట్ యాప్ ఆప్షన్ ను ఎంచుకోండి. మీరు ఎవరికైనా టిప్ ఇవ్వాలనుకుంటే వారి టిప్స్ చిహ్నం యాక్టివేట్ అయ్యి ఉండాలి.మరింత సమాచారం తెలుసుకోండి: