ట్రూ కాలర్.. చాలా మంది మొబైళ్లలో ఉండే యాప్ ఇది. ఈ యాప్ ఉంటే చాలు.. మనకు కొత్తగా ఎవరు కాల్ చేసినా.. వాళ్ల నెంబర్ మన కాంటాక్ట్ లిస్ట్‌లో లేకపోయినా.. సరే.. వాళ్లు ఎవరో మనకు ఇట్టే చెప్పేస్తుంది. దీనిని బట్టి మనం ఆ కాల్ అటెండ్ చేయాలా వద్దో నిర్ణయించుకోవచ్చు.. అలాగే అపరిచితుల నుంచి వచ్చే కాల్స్ ఎవరు చేస్తున్నారో తెలుసుకోవచ్చు.. అందుకే ఈ యాప్‌ను చాలా మంది వాడుతుంటారు. ప్రత్యేకించి స్పామ్ కాల్స్‌ ను ఈ ట్రూకాలర్ ముందే చెబుతుంది. దీనివల్ల అలాంటి కాల్స్ తో మన టైమ్ వేస్ట్ కాదు.


అలాంటి ట్రూ కాలర్ యాప్.. ఇప్పుడు కొత్త రికార్డు సృష్టించిందట. కాలర్‌ ఐడెంటిఫికేషన్‌ యాప్‌ ట్రూకాలర్‌ యాజర్ల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 30 కోట్లకు చేరుకుందట. ఇందులో విశేషం ఏంటంటే.. ఈ మొత్తం 30 కోట్ల మంది యూజర్లలో 22 కోట్ల మంది మన భారతీయులేనట. అంటే టోటల్ యూజర్లలో నాలుగింట మూడొంతులు మన ఇండియన్లే అన్నమాట. ఈ ట్రూ కాలర్ యాప్ యూజర్ల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోందట. ఎందుకంటే.. గత ఏడాది దీని యూజర్ల సంఖ్య 25 కోట్లు ఉండేదట.


అంటే ఏడాదిలోనే దాదాపు 5 కోట్ల మంది కొత్త యూజర్లను ఈ ట్రూ కాలర్ యాప్ సంపాదించిందన్నమాట. ఈ ట్రూ కాలర్ యాప్ సేవలు దాదాపు 11 ఏళ్ల క్రితం మొదలయ్యాయి. ఈ యాప్ ప్రపంచంలోని అనేక దేశాలలో సేవలు అందిస్తోంది. అనేక భాషల్లోనూ ట్రూ కాలర్ యాప్ సేవలు అందుతున్నాయి. కేవలం కాలర్ ఐడెంటిఫికేషన్ మాత్రమే కాదు.. ఇంకా ట్రూ కాలర్ యాప్ అనేక కొత్త సేవలను కూడా అందిస్తూ సేవలు విస్తరిస్తోంది. అవేంటంటే.. స్పామ్‌ బ్లాకింగ్‌, స్మార్ట్‌ ఎస్సెమ్మెస్‌, ఇన్‌ బాక్స్‌ క్లీనర్‌, ఫుల్‌ స్క్రీన్‌ కాలర్‌ ఐడీ, గ్రూప్‌ వాయిస్‌ కాలింగ్‌.. ఇలా అనేక కొత్త సదుపాయాలను అందిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: