ప్రపంచం దేశాలలో కరోనా అనంతరం అయినా మార్పులు వస్తాయని ఎదురుచూడటం నిరాశనే మిగిలించింది. ఇంతటి అత్యవసర పరిస్థితులలో కూడా ఆయా దేశాలు స్వార్థప్రయోజనాలు చేసుకుంటున్నాయి తప్ప, ఇప్పటికైనా శాంతిని, సేవా దృక్పధాన్ని అలవాటు చేసుకోలేకపోతున్నాయి. ఈ వరుసలో ముందు చైనా, పాక్ లు ఉన్నాయనడంలో అసలు సందేహం అవసరం లేదు. కేవలం ఆ రెండు దేశాల మూలంగా నేడు ప్రపంచ దేశాలలో ఒక దేశం బాహాటంగా తీవ్రవాద దేశంగా రూపొందింది. ఈ పరిస్థితులలో కూడా హింస తప్ప మరొకటి ఆలోచించలేకపోయిన ఆ దేశాలను ప్రపంచ దేశాలు ఎలాగూ పక్కన పెట్టినప్పటికీ, అవి వాటి దాయాది దేశాల పట్ల వ్యూహాలు పన్నుతూనే ఉన్నాయి. ఇవన్నీ అంతర్జాతీయ సమాజాన్ని ప్రభావితం చేయనున్నామని తెలిసినప్పటికీ వాళ్ళ కుటిల ప్రయత్నాలు మాత్రం ఆగటం లేదు.

సాధారణంగా ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా వాణిజ్య అవసరాల కొరకు రెండు దేశాలు ఒప్పందాలు చేసుకోవడం తెలిసిందే. అయితే యుద్ధ పన్నాగాలు మారిపోవడంతో వాణిజ్యం నుండి జీవాయుదాల నుండి నేడు ఇతర దేశాల ను అనిచ్చితి పరిస్థితికి తెచ్చే వ్యూహాల వరకు కొన్ని దేశాలు అంతర్జాతీయ సమాజాన్ని వాడుకుంటున్నాయి. ఇందుకు సామజిక మాధ్యమాలు బాగా పనికొస్తున్నాయి. ఇవి ఎక్కడికైనా వెళ్లిపోతున్నాయి కాబట్టి, ప్రపంచంలో ఎవరైనా ఎవరినైనా ఏమైనా అనవచ్చు. కావాలి అనుకుంటే ఆయా వ్యక్తులు లేదా దేశంపై లేనిపోయిని ప్రచారాలు కూడా చేయవచ్చు. సాధారణంగా ఇలాంటివి ఆయా మాధ్యమాలు చేయడం న్యాయపరంగా కూడని పని, కానీ ఆ విలువలు పట్టించుకోని కొందరు ఇష్టానుసారంగా సామజిక మాధ్యమాలను వాడుకుంటూ విష ప్రచారాలు చేస్తున్నారు.

ఈ మధ్య ఇలాంటి విషప్రచారాలు భారత్ పై, ప్రభుత్వంపై అనేకంగా పెరిగిపోతున్నాయి. అందుకే తాజాగా భారత పార్లమెంట్ వ్యవస్థ దానిని అదుపు చేయడానికి కొత్త చట్టాలను తీసుకురావడానికి లేదా ఉన్న వాటిలో సవరణలు చేయడం లాంటివి చేయడానికి పూనుకుంటుంది. కనీస విలువలు మరిచిపోవడం నేటి సమాజంలో అదొక ఫ్యాషన్ అనుకుంటున్నారేమో కానీ, ఆయా వ్యవస్థల విలువలు కూడా పూర్తిగా నశించిపోగలవని ఆ సంస్థలు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే, సాంకేతికత రోజురోజుకు మారిపోతుంది, అది కాకపోతే ఇంకోటి అనే ధోరణి వస్తే, మార్చేయడం చాలా సులభం. కానీ అంతర్జాతీయ సమాజంలో ఉమ్మడిగా కొన్ని సాంకేతికత ఉండాల్సిన అవసరం ఉంది, అవి కూడా విలువలు వదిలేస్తే ఇక చేసేది ఏమి ఉండబోదు కాబోలు!

మరింత సమాచారం తెలుసుకోండి: