ప్రముఖ మొబైల్ తయారీ సంస్థల కి భారత మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు వున్న విషయం తెలిసిందే..అందులో వన్ ప్లస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మామూలు ధరలోనే ప్రీమియం స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తూ మార్కెట్ లో మంచి మార్కెటింగ్ ను ఏర్పాటు చేసుకుంటుంది. వన్ ప్లస్ తమ మార్కెట్ ను మరింత విస్తరించేందుకు వరుసగా రకరకాల ఫీచర్లతో స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తూ వస్తోంది. ఇప్పటికీ వన్ ప్లస్ నుంచి 9 సిరీస్ లను విడుదల చేయగా ఇప్పుడు పదవ సీరీస్ ను కూడా లాంచ్ చేసేందుకు సిద్ధం అవుతోంది.

ఈ క్రమంలోనే కొన్ని వారాల నుంచి వన్ ప్లస్ సెవెన్ ప్రో స్మార్ట్ ఫోన్ లాంచింగ్ పై రకరకాల పుకార్లు బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు తాజాగా ఈ మొబైల్ కు సంబంధించిన ఫీచర్లు ఆన్లైన్లో లీక్ అయ్యాయి.. ఇక ఈ లీకైన ఫీచర్లను బట్టి చూస్తే మనము.. ప్రాసెసర్ బ్యాటరీ విషయంలో నైన్ ప్రో కంటే చాలా మెరుగ్గా  ఉన్నట్లు సమాచారం. అంతేకాదు ట్రిపుల్ రియర్ కెమెరా సెట్ అప్ తో  పాటు క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 1  చిప్సెట్ అందించనున్నట్లు సమాచారం.

 ఈ మొబైల్ 6.7 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే తో మనకు లభిస్తుంది. బ్యాటరీ సామర్థ్యం విషయానికి వస్తే 5000 ఎంఏహెచ్ , స్టోరేజ్ విషయంలో 12 జీబీ ఎల్ పీడిడిఆర్ 5 ర్యామ్ , 256gb స్టోరీస్ తో మనకు లభించనుంది. అంతే కాదు ఇందులో 48 మెగా పిక్సల్ ప్రైమరీ షూటర్ తో పాటు 50 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ అలాగే 8 మెగాపిక్సల్ టెలిఫోటో కెమెరాలు కూడా అమర్చారు .  32 మెగాపిక్సల్ సెల్ఫీ స్నాపర్ కెమెరా ని కూడా చేర్చడం గమనార్హం. అంతే కాదు వన్ ప్లస్ సెవెన్ ప్రో లో కొత్త తరహా డిజైన్ కూడా ఉండబోతోంది అన్నట్లుగా తెలుస్తోంది.. 2002లో మొదట చైనాలో లాంచ్ అయిన తర్వాత భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్లలో స్మార్ట్ఫోన్లు లాంచ్  చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: