ఇక సంక్రాంతి పండుగ సీజన్ వచ్చిందంటే చాలు చిన్నా పెద్ద ముసలి ముతక అనే తేడా లేకుండా అందరూ కూడా చిన్నారులుగా మారి గాలి పటాలను ఎగరేస్తూ అన్ని టెన్షన్స్ మర్చిపోయి చాలా హ్యాపీగా ఆడుకుంటారు.అయితే పూర్వం వీటిని ఆత్మరక్షణకు ఇంకా సమాచారాన్ని పంపించడం కోసం మన పూర్వికులు ఉపయోగించేవారట.ఇక ఆ తర్వాత సిగ్నలింగ్‌ ఇంకా అలాగే మిలటరీ ఆపరేషన్స్‌లోనూ వీటిని వినియోగించారు. ఒకప్పటి గాలిపటాలు చూసినట్లయితే అవి మందంగా ఇంకా దీర్ఘచతురస్రాకారంలో ఉండేవి. క్రీస్తుపూర్వం 206 వ సంవత్సరంలో చైనాలో హేన్ వంశపు రాజుల చరిత్ర ప్రారంభం కావటానికి గాలిపటమే దోహదం చేసిందని ఇప్పటి పరిశోధకులు వెల్లడించారు.ఇక దుర్మార్గుడైన ఆ రాజును ఓడించేందుకు హేన్‌ చక్రవర్తి వచ్చిన ఉపాయమే ఈ తొలి గాలిపటం.అయితే ఆ రాజు కోటలోకి సొరంగాన్ని తవ్వాలనేది అతని ఆలోచన. కానీ ఎంత దూరం తవ్వాలో అనే విషయం ఆలోచించి హేన్‌ చక్రవర్తి ఒకదాన్ని గాలిపటంలా తయారుచేసి దారం కట్టి ఎగరవేశాడు.

ఇక ఆ దారాన్ని కొలిచే సొరంగం తవ్వి సైనికులను పంపి కోటను వశం చేసుకున్నాడనే ఈ గాలి పటాల వెనకాల వున్న సైన్స్ అట.అయితే ఈ గాలి పటాలు ఎగరవేయడం వెనకాల ఇంకా చాలా ఆశక్తికరమైన కారణం కూడా ఉంది.మన పూర్వకాలంలో గాలిపటాలను పగటి పూట ఎగరవేయడంలో ఒక ఆరోగ్యపరమైన ప్రయోజనం కూడ ఉంది. గాలిపటాలు ఎగర వేసేటపుడు ఎక్కువ సమయం మన శరీరం సూర్యకిరణాలకు బహిర్గతం అవుతుందట. ఇక అందువల్ల ఆరోగ్య రీత్యా ఇది చాలా మంచిది. ఇంకా చాల మంచి అలవాటు అని కూడా ఆయుర్వేద శాస్త్రంలో నిపుణులు చెపుతారు. వీటిని ఎగరవెయ్యడం వలన మన శరీరంలో ఉన్న చెడు బాక్టీరియా కూడా ఈజీగా తొలగిపోతుంది. అలాగే అనేక రకాల ఇన్ఫెక్షన్లు కూడా ఈజీగా పోతాయి.ఇక ఎండలో ఉండడం వలన వెచ్చని ఆహ్లాదాన్ని కూడా మన మనస్సుకు కలిగిస్తుంది. అందుకే గాలిపటాలు ఎగరవేసే సాంప్రదాయం వెనక ఇంత మంచి సైన్స్ వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: