మీరు గూగుల్‌ సెర్చ్ లో కస్టమర్ కేర్ నెంబర్ కోసం వెతికి కాల్ చేస్తున్నారా? అయితే చాలా జాగ్రత్త. లేకపోతే, నెరగాళ్ల చేతిలో మోసపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది.గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ సైబర్ నేరాలు అనేవి చాలా పెరిగిపోతున్నాయి. అమాయకుల్ని టార్గెట్ చేసి కొన్ని లక్షల రూపాయలు కాజేస్తున్నారు. ఏమాత్రం అనుమానం రాకుండా రోజు రోజుకి కొత్త కొత్త పద్ధతిలో నేరగాళ్లు మోసాలు చేస్తున్నారు. పోలీసులు ఇంకా మీడియా ఎంత జాగ్రత్తగా ఉండాలని సూచించిన కాని ఈ సైబర్ నేరాల రేటు పెరిగిపోతున్నాయి.ఇక ఆన్‌లైన్‌లో పిజ్జా ఇంకా డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ చేస్తున్నప్పుడు తాను కోల్పోయిన డబ్బును తిరిగి పొందడానికి గూగుల్‌లో కనిపించిన కస్టమర్‌ కేర్‌ నెంబర్‌కు కాల్ చేసినందుకు గాను ఒక సీనియర్ సిటిజన్ ఏకంగా 11 లక్షలకు పైగా మోసపోయినట్లు ముంబై పోలీసులు జనవరి 15 వ తేదీన తెలిపారు.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే .. ముంబై నగరంలోని అంధేరి ప్రాంతానికి చెందిన ఒక సీనియర్ మహిళ గత ఏడాది జూలైలో ఆన్‌లైన్‌లో పిజ్జా ఆర్డర్ చేసింది.ఇక అప్పుడు పిజ్జా ఆర్డర్ కోసం ఫోన్‌లో నుంచి డబ్బులు చెల్లించేటప్పుడు ఆమె రూ.9,999 కోల్పోయింది. అదేవిధంగా అక్టోబర్ 29 వ తేదీన ఆన్‌లైన్‌లో డ్రై ఫ్రూట్స్ కోసం ఆర్డర్ చేస్తుండగా మళ్లీ రూ.1,496 నష్టపోయినట్లు ఆ మహిళ తెలిపింది. ఇక ఈ రెండు సందర్భాల్లో డబ్బులు పోవడంతో వాటిని తిరిగి పొందడం కోసం ఆమె ఫోన్లో గూగుల్‌లో కస్టమర్ కేర్ నెంబర్ కోసం వెతికి ఒక నెంబర్‌కు కాల్ చేసిందట.

ఇక ఆమెకు కాల్ చేసిన వ్యక్తి నిజమైన కంపెనీ కస్టమర్ కేర్ వ్యక్తిగా నటించి మాట్లాడట.ఆ నకిలీ వ్యక్తి డబ్బులు తిరిగి పొందటం కోసం తన మొబైల్ ఫోన్‌లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలని ఆమెకు సూచించాడు. ఆమె ఆ వ్యక్తి చెప్పిన విధంగానే చేసిందట. కానీ, అది ఒక నకిలీ యాప్ అని ఆమె గుర్తించలేకపోయింది. ఆ యాప్‌లో నమోదు చేసిన ఖాతానెంబర్, పాస్వవర్డ్ ఇంకా ఓటీపీ వివరాలు అన్నీ మోసాగాళ్లు రాబట్టుకున్నారు. దీంతో రెచ్చిపోయిన మోసాగాళ్లు గత సంవత్సరం నవంబర్ 14 నుంచి డిసెంబర్ 1 మధ్య కాలంలో ఆ మహిళ బ్యాంకు ఖాతా నుంచి రూ.11.78 లక్షలు డబ్బును బదిలీ చేసినట్లు ఆయన తెలిపారు.

ఈ మోసం అంత కూడా ఆమె సైబర్ పోలీస్ స్టేషన్ సంప్రదించినప్పుడు ఈ మోసం వెలుగులోకి వచ్చినట్లు అక్కడ అధికారి తెలిపారు. ఆమె చేసిన ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 420 ఇతర నిబంధనల కింద ఆ మోసాగాళ్ల పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: