పోర్న్ వీడియోస్ చూస్తున్న సందర్భంలో మధ్య మధ్యలో కొన్ని మెసేజెస్ వస్తుంటాయి. వాటిని ఓపెన్ చేశారా..అంతే..! మీ ఖాతాలో ఉన్న సొమ్మంతా కాళీ కావాల్సిందే. మరి ఆ మోసాలు ఏ విధంగా జరుగుతున్నాయో.. ఎలా జరుగుతున్నాయో తెలుసుకుందామా..! ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంత పెరిగిందో అంతే నష్టం కూడా,  మనం జాగ్రత్తగా ఉండకపోతే జరుగుతుంది. ఒక స్కామ్ విషయంలో మనం అప్రమత్తంకాగానే, మరో స్కామ్  పుట్టుకొస్తోంది. ఇలా ఎంతోమంది నెటిజన్లు  నిత్యం మోసాల బారిన పడుతూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా పోర్న్ స్కామ్ అనేది ఎక్కువగా జరుగుతోంది. అయితే ఇది పాత స్కామ్. అయినప్పటికీ మళ్లీ దీని బారిన చాలా మంది పడుతున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని ఎంతోమంది మోసపోతున్నారు.

ఈ మధ్యకాలంలో మోసాలు  అనేవి చాలా పెరిగిపోతున్నాయి. పోర్న్ వీడియోస్ చూస్తూ ఉండగా సడన్ గా బ్రౌజర్ అనేది బ్లాక్ అయిపోవడం, డబ్బులు చెల్లించాలని అందులో మెసేజ్ రావడం, మళ్లీ అమౌంట్ అన్ బ్లాక్ కావడం ఈ మధ్య జరుగుతున్న తతంగం. అయితే ఈ మోసలపై  సైబర్ సెక్యూరిటీ సంబంధించిన రీసెర్చరు ఒకరు అప్రమత్తం అయ్యారు.

 మోసం ఎలా చేస్తున్నారంటే..!
 సైబర్ నేరగాళ్లు మోసం ఎలా చేస్తున్నారో ఇంటర్నెట్ సెక్యూరిటీ రీసెర్చరులో ఒకరైనా రాజశేఖర్ వెల్లడించిన వివరాల ప్రకారం ఒక యూజర్ పోర్న్ చూస్తూ ఉండగా బ్రౌజర్ అనేది బ్లాక్ అవుతుంది. ఆ బ్రౌజర్ను మళ్లీ అన్ బ్లాక్ చేయాలంటే డబ్బులు చెల్లించాలని ఒక మెసేజ్ వస్తుంది. తర్వాత బ్రౌజర్  ఆగిపోతుంది. ఈ మెసేజ్ మినిస్ట్రీ ఆఫ్లా అండ్ జస్టిస్ నుండి వచ్చినట్టు  నమ్మిస్తారు. భారత చట్టం ప్రకారం నిషేధించబడినటువంటి వాటిని వీక్షించడం  చట్టవిరుద్ధమైన మెసేజ్ ఉంటుంది. దీని వల్ల మీ కంప్యూటర్ లాక్ అయిపోయిందని, దీన్ని అన్ లాక్ చేయాలంటే  29 వేల రూపాయలు చెల్లించాలని ఉంటుంది. ఈ అమౌంట్ ను కొన్ని గంటల్లో చెల్లించకపోతే  మిమ్మల్ని నేరవిచారణ కింద  పోలీస్ శాఖకు తరలిస్తారని మెసేజ్ లో ఉంటుంది.


 ఈ ఒక్క మెసేజ్ తో పాటుగా అమౌంట్ సెక్షన్ కూడా ఉంటుంది. మాస్టర్ కార్డు లేదా వీసా కార్డుతో డబ్బులు చెల్లించే ఆప్షన్ అక్కడ కనబడుతుంది. అయితే ఆ మెసేజ్ మనం నమ్మే విధంగా ఉంటుంది. ఒకవేళ మీరు నమ్మరంటే అడ్డంగా మోసపోయినట్టే, భారత్లో పోర్న్ వీడియోలు నిషేదం చేసిన మాట నిజమే. కానీ గవర్నమెంట్ ప్రజల యొక్క మొబైల్ ఫోన్ లో కంప్యూటర్ లను ఎప్పుడు కూడా ట్రాక్ చేయదని నిపుణులు చెబుతున్నారు. అయితే గతంలో కూడా ఇలాంటి మోసాలు జరిగాయని, కానీ ఆ సమయంలో స్కామర్లు మూడు వేల రూపాయలు మాత్రమే దోచే వారని, ప్రస్తుతం 29 వేల వరకు మోసం చేస్తున్నారని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: