ఇక ఎక్కడ చూసిన ఓ ప్రకటన కనిపిస్తుంది. 4Gకాదు ఇక 5g అంటూ ప్రకటనలు మనం ఎప్పుడు చూస్తున్నాం. అంత మాత్రమే కాదు మా నెట్వర్క్‌(Mobile Network) ఎక్కడైన ఉంటుంది. ఇలాంటి టైంలో కూడా దేశం 5g నెట్‌వర్క్‌లా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, మీరు 4G లేదా 3G నెట్‌వర్క్‌ని సరిగ్గా పొందలేని ప్రదేశాలు అనేవి ఇంకా చాలా ఉన్నాయి.నెట్‌వర్క్ అనేది లేకుండా మీరు ఎక్కడికీ కాల్ చేయలేరు. ఇంటర్నెట్‌ని సరిగ్గా ఉపయోగించలేరు. అయితే బ్యాడ్ మొబైల్ నెట్‌వర్క్‌తో మీరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారా? నెట్‌వర్క్ లేకుండా ఇంకా మీరు ఎక్కడికీ కాల్ చేయలేరు లేదా ఇంటర్నెట్‌ని ఉపయోగించలేరు. అయితే కొన్ని సులభమైన ట్రిక్స్ ద్వారా మీరు మీ ఫోన్ నెట్‌వర్క్‌ని స్పీడ్ గా పెంచుకోవచ్చు. ఇక అవేంటో ఓ సారి ఇక్కడ చదువుకొని తెలుసుుకందాం.



1. ఎయిర్‌ప్లేన్ మోడ్..మీ ఫోన్ నెట్‌వర్క్‌కి రీస్టార్ట్ చేయడం ద్వారా సమస్య అనేది చాలా వరకు కూడా దూరమవుతుంది. ఇక దీని కోసం మీరు మీ స్మార్ట్‌ఫోన్ క్విక్ సెట్టింగ్ ప్యానెల్‌కు వెళ్లాలి. చాలా ఫోన్‌లలో క్రిందికి స్వైప్ చేసినప్పుడు ఈ స్క్రీన్ అనేది తెరవబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను మీరు ఒకసారి ఆన్ చేయండి.అలాగే కాసేపటి తర్వాత దాన్ని మీరు ఆఫ్ చేయండి.


2.తరువాత ట్రిక్ ఏంటంటే ఫోన్‌ని రీస్టార్ట్ చేయండి. నెట్‌వర్క్ లాగా, ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం వల్ల నెట్‌వర్క్ చాలా రెట్లు అనేది పెరుగుతుంది. ఇక మీ ఫోన్ పవర్ బటన్‌ను ఎక్కువసేపు నొక్కండి (అలాగే చాలా ఫోన్‌లలో మీరు పవర్ బటన్‌తో పాటు వాల్యూమ్ డౌన్ బటన్‌ను కూడా నొక్కాలి). ఇక్కడ ఇచ్చిన రీస్టార్ట్ ఆప్షన్‌పై మీరు నొక్కండి. ఇక అప్పుడు మీ ఫోన్ రీస్టార్ట్ అవుతుంది. నెట్‌వర్క్‌ను మళ్లీ సెర్చ్ చేస్తుంది.


3.నెట్‌వర్క్ సెట్టింగ్‌లను రీసెట్ చెయ్యండి.నెట్‌వర్క్‌ను సెర్చ్ చెయ్యడానికి మూడవ మార్గం కూడా ఉంది. ఇందుకోసం ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి రీసెట్ ఆప్షన్‌ని మీరు సెర్చ్ చేయండి. ఇప్పుడు రీసెట్ ఆప్షన్‌కి వెళ్లి రీసెట్ మొబైల్ నెట్‌వర్క్ ఎంపికపై కూడా క్లిక్ చేయండి. ఇలా చేసిన తర్వాత కూడా మీ ఫోన్ రీస్టార్ట్ అవుతుంది.ఇక పైన పేర్కొన్న మూడు ట్రిక్స్ ఉపయోగించిన తర్వాత కూడా ఫోన్‌లో కనుక సిగ్నల్ రాకపోతే, ఇక దానికి చివరి పరిష్కారం సిమ్ కార్డ్. ఫోన్ నుంచి మీ SIM కార్డ్ ని తీయండి. ఇక ఇప్పుడు డ్యామేజ్ వుందో లేదో చూడాలి. ఒకవేళ SIM కనుక పాడైపోయినట్లయితే మీ SIM ఆపరేటర్‌ని సంప్రదించండి. లేకుంటే ఫోన్‌లో సిమ్‌ని మళ్లీ ఇన్‌సర్ట్ చేయండి.అప్పుడు నెట్‌వర్క్ తిరిగి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: