ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హావ బాగానే కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి తప్పించుకునేందుకు.. ఆయ కంపెనీ లు వాహనాల కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలు కొన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ఇప్పటికే వివిధ రకాలైన కొన్ని బైక్స్ మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఇందులో కొన్ని వాహనాలు తయారయ్యి మరి కొద్ది రోజుల్లో మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. ప్రముఖ దిగ్గజ సంస్థ అయినటువంటి యమహా సంస్థ తన ఎలక్ట్రిక్ స్కూటర్ లను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. యమహా బ్రాండెడ్ నుంచి..E-01 బైక్ ని మొదలు పెట్టారు..


ప్రముఖ దేశాలు అయినటువంటి థాయిలాండ్, తైవాన్, ఇండోనేషియా, మలేషియా వంటి వాటిలో ఎలక్ట్రానిక్ బైకు విడుదల చేస్తోంది. స్కూటర్ అన్ని విధాలుగా తట్టుకునే విధంగా రూపొందించబడుతోంది. విభిన్నమైన వాతావరణంలో కూడా ఈ బైక్ తట్టుకునే విధంగా నిర్వహించనున్నట్లు కంపెనీ సంస్థ తెలుపుతోంది. ప్రస్తుతం సిటీ మొబిలిటీ ని దృష్టిలో ఉంచుకుని ఈ బైక్ను తయారు చేయడం జరుగుతుందట. యమహా E -01 ఎలక్ట్రిక్ స్కూటర్ 4.9 KWH లిథియం-అయాన్ బ్యాటరీ తో వస్తున్నట్లుగా తెలియజేశారు.


ఈ బ్యాటరీ సహాయంతోనే 5000 RMP వద్ద 8.1KW ,1,950 RPM వద్ద 30.2 NM టార్క్ ను ఉత్పత్తి చేస్తున్నట్లు గా తెలియజేశారు. ఈ బైక్ సుమారుగా 100 కిలోమీటర్ల రేంజ్లో అందిస్తున్నట్లు గా తెలియజేశారు. ఎలక్ట్రిక్ బైక్ 3 పవర్ మోడళ్లలో పాటు రివర్స్ మోడల్ లో కూడా అందిస్తోంది. ఈ స్కూటర్ లో మూడు రకాల చార్జింగ్ సదుపాయాలను కూడా అందిస్తోంది. ఇక రాబోయే రోజులలో దీని ధర, స్పెసిఫికేషన్స్ ను త్వరలోనే తెలియజేయబోతున్నట్లుగా యమహా సంస్థ చైర్మన్ తెలియజేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ బైక్ లకు తమపై చాలా గట్టి పోటీ ఇవ్వబోతోంది అని తెలియజేశారు. ఈ బైక్ అన్ని విధాల తట్టుకొని ఉంటుందని కూడా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: