ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్లతో ప్రైవేటు రంగ సంస్థలైన ఎయిర్టెల్,  వొడాఫోన్,  ఐడియా,  రిలయన్స్ జియో వంటి  ప్రైవేటు టెలికాం సంస్థ లతో ఎప్పటికప్పుడు పోటీపడుతోంది. ఈ క్రమంలో తాజాగా మరొకసారి ఈ కంపెనీలకు 4 బెస్ట్ ఆఫర్ లను అందించడానికి సిద్ధమైంది బిఎస్ఎన్ఎల్. ఈ ఆఫర్ ల ద్వారా కస్టమర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు . ఇకపోతే రూ.  100 లోపు లభించే ఆ నాలుగు ఆఫర్ లు ఏమిటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

బిఎస్ఎన్ఎల్ రూ.49 ప్లాన్ :
ఈ ప్లాన్ ఎంచుకున్న వినియోగదారులకు ఏకంగా 2 జీబీ డేటా లభిస్తుంది.  అలాగే 100 నిమిషాల పాటు వాయిస్ కాలింగ్ , 24 రోజుల పాటు ప్లాన్ వాలిడిటీ ఉండటం గమనార్హం. అత్యవసర పరిస్థితుల్లో బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ చాలా చక్కటి ఆఫర్ అని చెప్పవచ్చు.

బిఎస్ఎన్ఎల్ రూ.94 ప్లాన్ :
బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ గడువును 45 రోజులు ఉంటుంది . మొత్తం మూడు జీబీ డేటా లభించడంతోపాటు 100 నిమిషాల వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని కూడా అందించడానికి సిద్ధం అయ్యింది బిఎస్ఎన్ఎల్.

బిఎస్ఎన్ఎల్ రూ.98 ప్లాన్ :
ఇకపోతే ఈ ప్లాన్ ఎంచుకున్న వినియోగదారులకు మొత్తం ప్రతిరోజు 3 జిబి డేటా లభిస్తుంది. అంటే ఇరవై రెండు రోజులపాటు వ్యాలిడిటీ లభించే ఈ ప్లాన్ తో ఏకంగా 48 జిబి డేటా ను ఉచితంగా పొందవచ్చు ముగిసిన తర్వాత కూడా మీరు 40 kbps స్పీడ్ తో డేటా ను  ఉపయోగించుకోవచ్చు.

బిఎస్ఎన్ఎల్ రూ.99 ప్లాన్ :
ఇక బిఎస్ఎన్ అందిస్తున్న ఈ ప్లాన్ అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. 22 రోజుల పాటు నిరంతరాయంగా కాల్ మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించబడింది.

బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ నాలుగు ఆఫర్లు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఉండడం గమనార్హం దీంతో కస్టమర్లు సైతం హర్షం వ్యక్తం చేయడం జరుగుతోంది.





మరింత సమాచారం తెలుసుకోండి: