Infinix ఈరోజు తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Hot 12 Play ను అనౌన్స్ చేసింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం 8,499 రుపాయల ధరలో 6,000 mAh బిగ్ బ్యాటరీ ఇంకా అలాగే 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన బిగ్ డిస్ప్లే తో తీసుకువచ్చింది.ఇక ఈ స్మార్ట్ ఫోన్ ను 4జీబీ ర్యామ్ కి జతగా 3GB వర్చువల్ ర్యామ్ తో ను కూడా అందించడం కూడా విశేషమే. మరి ఈ ఈరోజే ఇండియన్ మార్కెట్లో ఎంట్రీ ఈ సరికొత్త ఇన్ఫినిక్స్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందామా.Infinix Hot 12 Play: ధర ఇంకా సేల్ విషయానికి వస్తే..ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే స్మార్ట్ ఫోన్ ను కేవలం 4GB ర్యామ్ ఇంకా అలాగే 64GB స్టోరేజ్ తో సింగల్ వేరియంట్ తో మాత్రమే అందించింది. ఇక దీని ధర కేవలం రూ.8,499. ఈ ఫోన్ మే 30 వ తేదీ నుండి flipkart ద్వారా ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.Infinix Hot 12 Play: స్పెక్స్ ఇంకా ఫీచర్లు విషయానికి వస్తే..ఇక ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే స్మార్ట్ ఫోన్ ఎంటర్టైన్మెంట్ కు అనుకూలమైన పెద్ద 6.82 ఇంచ్ HD+ డిస్ప్లేని పంచ్ హోల్ డిజైన్ తో కూడా కలిగి ఉంటుంది.


అంతేకాదు, ఈ డిస్ప్లే గేమింగ్ ఇంకా అలాగే స్పోర్ట్స్ కంటెంట్ కోసం ఉపయోగకరమైన 90Hz రిఫ్రెష్ రేట్ ఇంకా 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ సపోర్ట్ వస్తుంది. ఈ ఫోన్ వేగవంతమైన Unisoc T610 ఆక్టా కొర్ ప్రాసెసర్ శక్తితో కూడా పనిచేస్తుంది. దీనికి జతగా 4GB ర్యామ్ ఇంకా అలాగే 3GB వర్చువల్ ర్యామ్ ను కూడా కలిగివుంది. అలాగే, ఇందులో స్టోరేజ్ ను కూడా 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కూడా జతచేసింది.ఇక ఆప్టిక్స్ పరంగా, హాట్ 12 ప్లే వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ ను ఇది కలిగివుంది. ఇందులో, 13MP ప్రధాన కెమెరాకి జతగా డెప్త్ సెన్సార్ కూడా ఉంటుంది. అలాగే, పంచ్ హోల్ కటౌట్ లో 8ఎంపి సెల్ఫీని కూడా ఇది అందించింది. ఈ ఫోన్ టైప్-C ఛార్జింగ్ పోర్ట్ తో భారీ 6,000 mAh బ్యాటరీతో కూడా వస్తుంది.అలాగే ఈ ఫోన్ DTS సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితంగా XOS 10 సాఫ్ట్ వేర్ పైన కూడా నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: