టెక్నాలజీ లో ప్రస్తుతం ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి డేటా భద్రత కోసం పలు మార్పులు కూడా జరుగుతున్నాయి ఈ మార్పులో భాగంగా పాత డివైస్ లో సేవలను నిలిపి వేసి తాజాగా వాట్సాప్ సంస్ధ కూడా కొన్ని ఐఫోన్ లకు సంబంధించి సేవలను నిలిపివేయనున్నట్లు గా ప్రకటించడం జరిగింది. Ios -10,IOS-11 వర్షన్ మొబైల్ లకు ఐఫోన్ల ను ఈ ఏడాది అక్టోబర్ 24 నుంచి వాట్సాప్ పని చేయదని ఆ సంస్థ తెలియజేసింది. యూజర్లు వెంటనే తమ ఐఫోన్ ను అప్డేట్ చేసుకోవాలని వాట్సాప్ సంస్థ సూచిస్తోంది.

వాట్స్అప్ తాజా నిర్ణయంతో ఐఫోన్-5, ఐఫోన్-5C మోడల్స్ లో యాప్ సేవలు నిలిపివేయండి ఉన్నట్లు తెలుస్తోంది. IOS -12 వెర్షన్ IOS తో పని చేస్తున్న ఐఫోన్-5,5c , ఐ ఫోన్-6,6s యూజర్లకు వాట్సాప్ సేవలు ఎప్పటిలాగానే పనిచేస్తాయని స్పష్టం చేసింది. అయితే యూజర్లు తమ మొబైల్స్ లో ఓఎస్ వేరియేషన్ తెలుసుకునేందుకు OS అప్డేట్ చేసేందుకు ఎలా చేయాలో తెలియజేసింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.

1). ముందుగా ఐ ఫోన్ సెట్టింగ్ లోకి వెళ్లి అబౌట్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది.

2). అందులో సాఫ్ట్వేర్ అప్డేట్ ఆప్షన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది.

3).IOS అప్డేట్ కాకుండా లేటెస్ట్ వెర్షన్ సపోర్ట్ చేసేందుకు అప్డేట్ అవుతుంది.

అయితే వాట్సాప్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఎక్కువమంది ఐఫోన్ యూజర్లకు ఎలాంటి సమస్య ఉండదని టెక్ నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఐఫోన్ యూజర్లు ఎక్కువగా లేటెస్ట్ మోడల్ నీ ఉపయోగించుకుంటున్నారు.. అలాగే సాఫ్ట్ వేర్ అప్డేట్ వల్ల యూజర్ల డేటా పరంగా కూడా మెరుగైన సెక్యూరిటీ ఉంటుంది. టెక్నాలజీ పరంగా వాట్సప్ లో ఇలాంటి మార్పులు రావడం జరుగుతోంది. మరి ఎవరైనా ఐఫోన్ యూజర్లు ఇలాంటి మోడల్స్ కలిగిన మొబైల్స్ ఉంటే వాటిని అప్డేట్ చేసుకునేందుకు ప్రయత్నించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: