ప్రముఖ బ్రాండ్లు కలిగిన ఎల్జీ సంస్ధ ఎన్నో ఎలక్ట్రిక్ వస్తువులు తయారయ్యి విడుదలవుతూనే ఉన్నాయి. అంతేకాకుండా స్క్రీన్ తయారీలో రారాజు గా పేరు పొందింది ఈ సంస్థ. తాజాగా భారత్లో కి సరికొత్త టీవీ ని విడుదల చేసింది.. అది కూడా OLED టీవీని సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసి విడుదల చేసింది. ఇక ఈ టీవీ ప్రీమియం కస్టమర్లను ఆకట్టుకునేలా కనిపిస్తోంది.


ఎల్జి ఇండియాలో నిన్నటి రోజున ప్రీమియం టీవీ లను భారత్లో విడుదల చేసింది.. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది..LG సిగ్నేచర్ R OLED టీవీ గురించి.. ఈ స్మార్ట్ టీవీ ని రోల్ గా చుట్టుకోవచ్చట. అలా ఉండేలా ఈ ప్యానల్ ని తయారుచేయడం జరిగినట్లుగా ఆ సమస్త తెలియజేశారు. మనకి స్క్రీన్ అవసరం లేకున్నప్పుడు ఈ టెలివిజన్ ను మనం రౌండ్ గా చుట్టు కోవచ్చు. సాంకేతికంగా ఎంతో జాగ్రత్తగా అభివృద్ధి చేసిన ఈ టీవీనీ చూసిన వినియోగదారులు త్రిల్  అవుతున్నారని ఆ సంస్థ ప్రతినిధి తెలియజేయడం జరిగింది.


భారతదేశంలోనే మొదటిసారిగా ఇలాంటి అద్భుతమైన సాంకేతిక కలిగిన టీవీ ని విడుదల చేయడం మొదటి సారి అని చెప్పవచ్చు. తమ కస్టమర్ల కోసం ఇలాంటివి తీసుకొచ్చామని ఎల్జి సమస్త అధినేత తెలియజేశారు. ఇక ఈ టీవీ 97 అంగుళాలు కలదు. ఈ స్మార్ట్ టీవీ ధర రూ.75 లక్షల గా నిర్ణయించారు ఎల్జి సంస్థ. దీనితో పాటుగా ఇదే తరహాలో OLED సాంకేతిక గా వినియోగించుకుని మరి కొన్ని ప్రీమియం టీవీలను కూడా ఇండియాలో విడుదల కోసం తీసుకురాబోతున్నారు అని తెలియజేశారు. ధర ఎక్కువగా ఉండటం చేత తమ కస్టమర్లు దీనిని ఎంచుకోవడం చాలా కష్టమని అందుచేతనే తక్కువ ధరలో అలాంటి అనుభూతిని పొందే..G 2, Z2, C2 సిరీస్లను అందుబాటులోకి  తీసుకు వచ్చినట్లుగా lg సంస్థ తెలియజేసింది. ఇక ఇందులో ఎన్నో అడ్వాన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: