ఇక ఇటీవల హైడ్రోజన్‌తో నడిచే వాహనాల రిజిస్ట్రేషన్‌ను అనుమతించిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. టయోటా కిర్లోస్కర్ తిరువనంతపురంలోని RTO వద్ద టయోటా మిరాయ్ కారును రిజిస్టర్ చేయడం జరిగింది.ఇక ఈ రిజిస్ట్రేషన్ కూడా ఆన్‌లైన్‌లో జరిగింది. కేరళ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ రుసుము మినహా ఎలాంటి పన్ను ను విధించలేదు. అయితే, హైడ్రోజన్ కార్లను దేశంలో పరిశోధన కోసం మాత్రమే ఉపయోగించేందుకు అనుమతి ఉన్నందు వలన సాధారణ వినియోగదారులు ఈ కారును కొనుగోలు చేయలేరు. కొన్ని నివేదికల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే ఈ కారు ధర రూ. 1.1 కోట్లు. ఇక ఈ హైడ్రోజన్ కారు గురించి మరికొంత తెలుసుకుందాం.ఇది పరిశోధన కోసం ఉపయోగించబడుతుంది. ఈ టయోటా మిరాయ్ పరిశోధన ప్రయోజనం కోసం మాత్రమే తయారు చేయబడింది. టయోటా మిరాయ్‌ను పరిశోధన కోసం మాత్రమే ఉపయోగించాలనే షరతుతో ప్రభుత్వం హైడ్రోజన్ కార్ రిజిస్ట్రేషన్‌పై పన్నును కూడా మినహాయించింది.దేశంలో హైడ్రోజన్‌తో నడిచే వాహనాలకు హైడ్రోజన్ ఇంధన స్టేషన్లు అనేవి బాగా అవసరం. హైడ్రోజన్ ఇంధన స్టేషన్ నెట్‌వర్క్‌ను నిర్మించడానికి ఈ పరిశోధన అనేది జరుగుతోంది.


ఇక టయోటా మిరాయ్‌ను శ్రీ చిత్ర తిరునాల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఉంచనున్నట్లు కొన్ని నివేదికలు తెలిపాయి. తిరువనంతపురంలో ఉన్న ఈ కళాశాల ఆటోమొబైల్ కోర్సుకు చాలా బాగా ప్రసిద్ధి చెందింది. అదే సమయంలో, కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే 10 హైడ్రోజన్ బస్సులు ఇంకా 50 ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. ఇది కాకుండా డీజిల్ బస్సులను కూడా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది.అలాగే హైడ్రోజన్ సాయంతో భారీ వాహనాలను నడిపేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఇక్కడ హైడ్రోజన్ రీఫిల్లింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను రూపొందించడంలో మందగమనం కారణంగా టయోటా మిరాయ్‌ను భారతదేశానికి తీసుకురావాలనే ప్రణాళిక ఇక నిలిపివేయబడింది. ఇక ఈ కారు ఇప్పటికే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT)తో పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: