ప్రస్తుతం ఎటువంటి సమాచారాన్ని అయినా మనం ఎక్కువగా మెయిల్ ద్వారానే అన్నిటికీ సెండ్ చేస్తూ ఉంటాము. అంతేకాకుండా మన మొబైల్ ఉపయోగించాలన్నా కూడా కచ్చితంగా మెయిల్ అనేది ఉండాల్సిందే.. అయితే కొన్నిసార్లు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంటర్నెట్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలానే ఉంటాయి. ఈ -మెయిల్ ఉద్యోగుల నుండి మొదలు విద్యార్థుల వరకు అందరూ కూడా ఉపయోగించు కుంటూ ఉంటారు. అయితే మెయిల్ యాక్సెస్ చేయాలంటే కచ్చితంగా ఇంటర్నెట్ అనేది ఉపయోగించక తప్పదు. కానీ ఇంటర్నెట్ లేని చోట కూడా మెయిల్ ఉపయోగించుకునే సదుపాయం ఉన్నదట ఇక వాటి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

తాజాగా యూజర్స్ కోసం గూగుల్ ఇలాంటి ఫ్యూచర్ నే మనకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ఆఫ్ లైన్ లో జీ-మెయిల్ సేవలను పొందే అవకాశం కల్పించనున్నది. ఇంటర్నెట్ సదుపాయం లేని చోట కూడా మెయిల్స్ చదవడం,  రిప్లై ఇవ్వడం వంటి సేవలను కేవలం క్రోమ్ బ్రౌజర్ లోనే మాత్రమే ఉపయోగించుకోవచ్చు. అయితే ఇందుకోసం ముందుగా మన జీమెయిల్ లో  మనం ఆఫ్ లైన్ సేవలను ఎనేబుల్ చేసుకోవలసి ఉంటుంది. ఇందుకోసం కొన్ని సేఫ్ టిప్స్ ను  ఫాలో  కావలసి ఉంటుంది.

ఇందుకోసం ముందుగా మన క్రోమ్ బ్రౌజర్ లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న సమయంలోనే..mail.google.com ను  బుక్ మార్క్ ను యాడ్ చేసుకోవలసి ఉంటుంది.

అనంతరం జిమెయిల్ ఓపెన్ చేసి సెట్టింగ్ లో ఆల్ సెట్టింగ్ అని ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత ఆఫ్లైన్ ట్యాబ్ పైన క్లిక్ చేయగలరు.. అందులో ఎనేబుల్ ఆఫ్లైన్ మెయిల్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి.

ఆ తర్వాత ఈమెయిల్ ఆఫ్ లైన్ స్టోరీ చేయాలని కోరుతుంది. ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేంజెస్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత జీమెయిల్ ఆఫ్లైన్ సేవలను మనం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: