ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ అయినటువంటి మోటోరోలా సరికొత్తగా తన ఫ్లాగ్ షిప్ మోడల్ ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది . ఇక త్వరలో ఈ మోడల్ ను ఇండియన్ మార్కెట్ లోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు ఇటీవల టిప్ స్టర్ ముకుల్ శర్మ తెలిపారు. ప్రముఖ టెక్ దిగ్గజం అయినటువంటి మోటోరోలా నుంచి స్నాప్ డ్రాగన్ 8+ జన్ 1 ప్రాసెసర్ తో నడిచే ఫోన్ ను లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. జూలై 4వ తేదీన మోటోరోలాకు సంబంధించిన మోటో G42  5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయాలని ప్రయత్నం చేస్తోంది అంతేకాదు ఇటీవల బ్రెజిల్ లో మోటో G62 స్మార్ట్ ఫోన్ని కూడా లాంచ్ చేసి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఇకపోతే త్వరలోనే భారత మార్కెట్లోకి కూడా ఈ ఫ్లాగ్ షిప్ ఫోన్ లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది అయితే ఈ ఫోన్ కి సంబంధించిన పేరును మాత్రం ఇంకా రివీల్ చేయకపోవడం గమనార్హం.

ఇకపోతే ఇటీవల బ్రెజిల్ లో లాంచ్ చేసిన మోటో G62 స్మార్ట్ ఫోన్ ను  భారత మార్కెట్లోకి రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది.  ఇందుకు సంబంధించిన ఫీచర్స్ విషయానికి వస్తే 6.5 అంగుళాల ఇంచెస్ తో 120హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ తో పాటు..FHD + డిస్ప్లే ని కూడా ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది. బడ్జెట్ ఫోన్ ల కోసం  ప్రారంభించిన.. క్వాల్కం స్నాప్ డ్రాగన్ 480+SoC నీ కూడా  ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది. ఇకపోతే ఫైవ్ జి ఇంటర్నెట్ ను  ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 20 W టర్బో చార్జింగ్ టెక్నాలజీ తో 5000 Mah బ్యాటరీని ఈ ఫోన్ కలిగి ఉండడం గమనార్హం.

అంతేకాదు ఈ కంపెనీ డాల్బీ అట్మోస్ కి మద్దతుగా స్టీరియా స్పీకర్లను కూడా కలిగి ఉంది .కెమెరా విషయానికి వస్తే 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా.. 2 మెగా పిక్సెల్ సెన్సార్ తో పాటు 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్లు కూడా కలిగి ఉంది. ఇక సెల్ఫీ కోసం 16 మెగాపిక్సల్ కెమెరాను కలిగి ఉంది. ఇక త్వరలోనే పూర్తి ధరలతో భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: