ఇపుడు అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు దర్శమిస్తున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా అంతా ఫోన్లు వాడేస్తున్నారు. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే ముందు వరకు కూడా వాట్స్ యాప్ అని, యూట్యూబ్ అని,  ఆన్లైన్ షాపింగ్,  ఇంస్టా  గ్రామ్, రీల్స్ ఇలా అన్నిటితోనూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. మరి ఇక ఛార్జింగ్ పెట్టే సమయం ఎక్కడం.... ఎందుకంటే ఛార్జింగ్ ఫుల్ గా పెట్టాలి అంటే కనీసం గంట అయినా పడుతుంది. కొన్ని ఫోన్ లకు అయితే రెండు గంటలు కూడా పడుతుంది. అయితే పొద్దున లేచింది మొదలు ఫోన్ తో చిట్ చాట్ చేస్తుంటే ఇక ఛార్జింగ్ పెట్టేంత సమయం లేక చాలా మంది రాత్రి పడుకునే ముందు అలా ఛార్జింగ్ పెట్టి వదిలేసి ఉదయం లేచాక ఛార్జింగ్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. అయితే ఇలా చేయడం వలన ప్రమాదం ఏమైన ఉందా..సమస్య ఏదైనా ఉంటుందా అన్న ప్రశ్నలు అందరికీ వస్తుంటాయి. కాగ ఇందుకు నిపుణులు చెబుతున్న మాట ఏమిటంటే..!!

ఒకప్పట్లో అయితే మొబైల్ ఫోన్లను ఆలా రాత్రంతా ఛార్జింగ్ లో ఉంచితే సమస్య  ఉండేది కాదు. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఎంతగానో మారింది. దాంతో పాటుగా ఛార్జింగ్ విషయం లోనూ కొత్త అప్డేట్స్ వచ్చేశాయి. ఇప్పుడు అలాంటి సమస్యలు ఏమి కూడా లేవు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న స్మార్ట్ ఫోన్స్ ని  రాత్రంతా ఛార్జింగ్లో ఉంచినా పెద్దగా ప్రమాదం లేదనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం వాడకంలో ఉన్న స్మార్ట్ ఫోన్ల బ్యాటరీల లో లిథియం-అయాన్ లు.. ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత ఇవి విద్యుత్ను సంగ్రహించకుండా నిరోధించే పరికరాలను ఇన్బిల్ట్గా ఉంటాయి. అయితే..అలాగని  అన్నివేళలా ఫోన్ రాత్రంతా ఛార్జింగ్ పెట్టి ఉంచడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు.

ఎందుకంటే విద్యుత్ పంపిణీ ఎపుడు ఒకేలా ఉండదు.. హెచ్చుతగ్గులు ఉంటాయి అలాంటప్పుడు ఛార్జింగ్ లో ఫోన్ ని అస్సలు చూసుకోకుండా వదిలేయడం మంచిది కాదు అంటున్నారు.  అలాంటప్పుడు  అన్ని మోడల్ ఫోన్లు ప్రతికూల పరిస్థితులను తట్టుకోగలవా ? లేదా అన్నది ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సి విషయం. అందుకనే వీలైంత వరకు ఫోన్లను రాత్రులు ఛార్జింగ్ లో వదిలేయకుండా ఉండటమే మంచిది. అలాగే 40 % కంటే ఛార్జింగ్ తక్కువ కాక ముందే ఫోన్ ని ఛార్జింగ్ కి పెట్టడం మంచిది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: