ప్రముఖ బ్రాండెడ్ అయిన షియోమీ నుంచి 12 లైట్ స్మార్ట్ మొబైల్ సంబంధించి ఫ్రీ ఆర్డర్ ను కస్టమర్ల చేసుకోవడానికి ప్రారంభించింది. అయితే ఇందుకు సంబంధించిన అధికారికంగా మొబైల్ ఇంకా లాంచ్ కాలేదు ఈ స్మార్ట్ మొబైల్ వెబ్సైట్లో లిస్ట్ ఇవ్వలేదు ఈ మొబైల్ ధర ఫీచర్లు స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో లీక్ అయ్యాయి. షియోమీ సంస్థ ఇన్స్టాగ్రామ్ పోస్టులు దీనికి సంబంధించి కీలక స్పెసిఫికేషన్స్ విడుదల చేయడం. ఈ పోస్ట్ ప్రకారం ఫ్రీ ఆర్డర్ జులై 8వ తేదీన ప్రారంభమయ్యా అవకాశం ఉన్నది అయితే అధికారిక వెబ్సైట్లో అందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయలేదు.

షియోమి-12 మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ ధర:
ఈ మొబైల్ ధర 999 అజర్ బైజాన్ మనత్లుగా పరిగణించారు అయితే ఇండియన్ కరెన్సీ ప్రకారం దీని ధర రూ.46,000 ఉంటుందని అంచనా. బ్లాక్ ,పింక్, గ్రీన్ కలర్ లలో దీనిని విడుదల చేయబోతున్నారు ఇందులో డిస్ప్లే విషయానికి వస్తే 6.5 అంగుళాల ఆమోLED డిస్ప్లే కలదు దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 HZ ఉంటుంది. HDR -10 +డాల్బీ విజన్ సపోర్టుతో కలదు.

క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ -778 G ప్రాసెస్ తో కలదు. ఈ మొబైల్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ కూడా కలదు. కెమెరా విషయానికి వస్తే వెనుక వైపుగా మూడు కెమెరాలు ఉంటాయి ఇందులో మెయిన్ కెమెరా 108 మెగా పిక్సెల్ కాగా వీటితోపాటు 8 మెగా ఫిక్స్ఎల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా..2 మెగాపిక్సల్ మైక్రో కెమెరా ఉంటుంది. సెల్ఫీ ప్రియుల కోసం ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. ఇక బ్యాటరీ సామర్థ్యానికి వస్తే 4,300 MAH కాగ 67 W ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తుంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేస్తుంది. ఇందులోనే పలు రకాల మోడల్స్ ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: