ఇటీవల కాలంలో రిలయన్స్ జియో,  ఎయిర్టెల్, వోడాఫోన్ , ఐడియా,  బిఎస్ఎన్ఎల్ వంటి టెలికాం దిగ్గజ సంస్థలు ఒకదానితో ఒకటి పోటీపడుతూ కస్టమర్లను ఆకర్షించడానికి తక్కువ ధరకే ఆఫర్లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కష్టమర్లను పెంచుకోవడం కోసం తక్కువ ధరకే బెస్ట్ ప్లాన్ అందిస్తూ మరింత డేటాను కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాయి . ఈ క్రమంలోని టెలికాం దిగ్గజ సంస్థల్లో ఒకటైన ఎయిర్టెల్ కూడా తమ కష్టమర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా మరో రెండు అద్భుతమైన ప్లాన్లను కష్టమర్ ల కోసం తీసుకురావడం జరిగింది. ఇక ఈ ప్లాన్లకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.

తాజాగా ఎయిర్టెల్ .. రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. భారతీయ ఎయిర్టెల్ అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్ ల ధరల విషయానికి వస్తే.. రూ.699, రూ.999. ఇక ఈ ప్లాన్ల యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు చదివి తెలుసుకుందాం..

1. ఎయిర్టెల్ రూ.699 ప్లాన్ ..
ఎయిర్టెల్ తాజాగా కస్టమర్ల కోసం రూ.699 ప్లాన్ ను తీసుకొచ్చింది. ఇక ఈ ప్లాన్ వాలిడిటీ 56 రోజులు.. ముఖ్యంగా ఈ ప్లాన్ ను ఎంచుకున్న వినియోగదారులు ప్రతిరోజు 3GB డేటాను పొందవచ్చు. అంతేకాదు 56 రోజుల్లో మొత్తం 168 GB డేటా లభిస్తుంది. ఇక అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను పొందవచ్చు. ఇక ఈ ఆఫర్ వర్క్ ఫ్రమ్ హోం పేరిట ఉద్యోగాలు చేసే వారికి మరింత ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

2. ఎయిర్టెల్ రూ.999 ప్లాన్..
ఇక ఎయిర్టెల్ అందిస్తున్న ఈ ఆఫర్ ద్వారా 84 రోజులపాటు వాయిస్ కాలింగ్..ప్రతిరోజు 2.5జిబి డేటాను పొందే అవకాశం ఉంటుంది. ఇక అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తో పాటు ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్లను పొందవచ్చు. ఎక్కువ రోజులు వ్యాలిడిటీ ఉంటుంది . కాబట్టి ఈ ఆఫర్లను రీఛార్జ్ చేసుకుంటే తరచూ రీఛార్జ్ చేసుకుని ఇబ్బంది ఉండదు పైగా డేటా కూడా ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఆఫర్లను కస్టమర్లు వినియోగించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: