ఇప్పటి విద్యార్థుల ఏదొక విషయం పై నాలెడ్జ్ ను పెంచుకుంటూన్నారు.అయితే వారి ఆలోచనలు రాకెట్ కన్నా వేగంగా పరుగెడుతున్నాయి..అది నిజమే.. కొత్త కొత్త ప్రయోజనాలు చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం బైక్ వుంటే చాలు విచ్చలవిడిగా పొనిస్తున్నారు.కొన్నిసార్లు ఒకే బైకుపై ఐదుగురు, ఆరుగురు ప్రయాణించడం కూడా చూస్తుంటాం. ఇక డ్రంకెన్ డ్రైవ్ కేసులకైతే లెక్కే లేదు.పోలీసులకు పెద్ద తలనొప్పగా మారుతుంటాయి. అయితే ఈ సమస్యలన్నింటికీ ఒకే ఒక్క హెల్మెట్‌తో చెక్ పెట్టొచ్చు అని ఓ యువకుడు నిరూపించాడు. తాను రూపొందించిన సూపర్ హెల్మెట్ ధరించడం ద్వారా.. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..


బీహార్ రాష్ట్రం కిల్కారీకి చెందిన రాజ్ కుమార్ కేశరి.. హాజీపూర్‌లోని ఓ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇతడి తండ్రి మొబైల్ రీచార్జ్ షాపు నడుతున్నాడు. రాజ్ కుమార్.. ఇటీవల చదువుతో పాటూ కేశరి ఒన్నోవేషన్ హబ్ ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతున్నాడు. ఇందులో రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన అంశాలపై బోధిస్తారు. ఇదిలావుండగా, రాజ్ కుమార్.. త్రీ రూల్ ట్రాఫిక్ సిస్టమ్‌తో కూడిన స్మార్ట్ హెల్మెట్‌ను తయారు చేశాడు. ఇది బైక్ చోరీకి గురికాకుండా కాపాడుతుంది. అలాగే మద్యం తాగి డ్రైవ్ చేయడాన్ని నిరోధిస్తుంది. అదేవిధంగా దీన్ని ధరిస్తే.. ట్రిపుల్ రైడింగ్ చేయడం కూడా సాధ్యం కాదు. హెల్మెట్‌లో అమర్చిన సెన్సార్ వల్ల బైక్‌కు ఐదు మీటర్ల పరిధిలో ఉంటేనే స్టార్ట్ అవుతుంది. లేదంటే డూప్లికేట్ కీని ఉపయోగించినా బండి స్టార్ట్ అవదు..


ఇద్దరు వ్యక్తుల సగటు బరువు సెట్ చేయబడి ఉంటుంది. ఈ కారణంగా బైకుపై ముగ్గురు కూర్చోవడం సాధ్యం కాదు. రూ.1600తో ఈ హెల్మెట్‌ను రూపొందించినట్లు విద్యార్థి తెలిపాడు. నవంబర్ 25నుంచి 27వరకూ గోవాలో అంతర్జాతీయ స్థాయిలో.. ఇండియన్ యంగ్ ఇన్నోవేటర్, ఇన్వెంటర్ ఛాలెంజ్ అనే కార్యక్రమం జరగనుంది. ఇందులో వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు వారు కనిపెట్టిన వస్తువులను తీసుకొని వస్తారు.ఈ హెల్మెట్ ఇప్పుడు మార్కెట్ లోకి తీసుకొస్తె బాగుండునని అందరూ అభిప్రాయ పడుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: