ప్రముఖ బ్రాండెడ్ కలిగిన దిగ్గజ మొబైల్ సంస్థలలో మోటరోలా కూడా ఒకటి. తాజాగా ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త మొబైల్ ని విడుదల చేసింది. ఈ మొబైల్ పేరును మోటో G -42 పేరుతో స్మార్ట్ మొబైల్ ని విడుదల చేశారు. ఈ మొబైల్ 11న ఆన్లైన్లో సేల్ ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్ మొబైల్ కేవలం 4GB RAM,64 GB మెమొరీ సామర్థ్యం తో కలదు. ఇక ఈ మొబైల్ ధర విషయానికి వస్తే.. రూ.13,999 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఇక అంతే కాకుండా ఈ మొబైల్ ప్రారంభం దశలో sbi కార్డు తో కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.1000 రూపాయల డిస్కౌంట్ ను ప్రకటించింది. ఈ మొబైల్ రెండు కలర్లలో లభిస్తుంది.


 MOTO G -42 స్పెసిఫికేషన్ విషయానికి వస్తే..
ఈ స్మార్ట్ మొబైల్ ఆండ్రాయిడ్ -12 ఆధారంగా పనిచేస్తుంది. ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే..6.4 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే తో పాటు LED డిస్ప్లే కూడా అందించనుంది. ఈ మొబైల్ ఆక్టో కోర్ క్వాల్కాం స్నాప్ డ్రాగన్..680 ప్రాసెస్ తో కలదు. ఈ మొబైల్ లో అత్యధికంగా కెమెరాకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ మొబైల్ బ్యాక్ సైడ్  మూడు కెమెరాలు కలవు. ఇక మొదటి కెమెరా 50 మెగా పిక్సెల్, మరొకటి 8 మెగా పిక్సెల్, మరొకటి 2 మెగా పిక్సెల్ కలదు.

ఇక సెల్ఫీ ప్రియుల కోసం 16 మెగా పిక్సెల్  కెమెరా కలదు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఇందులో 4G LTE, వైఫై, బ్లూటూత్ 5.0,NFC,USB, టైప్ -C ఫోన్ చార్జర్ ఆప్షన్ కూడా కలదు. ఇక సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలదు. ఈ స్మార్ట్ మొబైల్ 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే 5000 MAH సామర్థ్యం కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: