ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీ ప్రకారం ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ మొబైల్ తో పాటు, ఇంట్లో ఒక స్మార్ట్ టీవీ ఉండనే ఉంటుంది. అయితే తాజాగా మార్కెట్లోకి పలు విధాలైన స్మార్ట్ టీవీలు విడుదల అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా హెసెన్స్ అని బ్రాండెడ్ సంస్థ నుంచి లేజర్ టీవీ విడుదల అయింది. ఈ స్మార్ట్ టీవీ 120 ఇంచెస్ కలదు. అడ్వాన్స్ టెక్నాలజీతో సరికొత్త యాప్లతో సరికొత్త అనుభూతిని అందించబోతున్నట్లుగా ఆ కంపెనీ సంస్థ తెలియజేయడం జరిగింది. ఇక ఈటీవీ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే..


ఈ స్మార్ట్ టీవీ 3000 లుమినస్ బ్రైట్నెస్ తోపాటు ,4k అల్ట్రా హెచ్డి పిక్చర్ క్వాలిటీతో కలదు. ఈ స్మార్ట్ టీవీ 120 అంగుళాల డిస్ప్లే పూర్తిగా అందిస్తుంది. అంతేకాకుండా 40 వాట్స్ డాల్బీ అటానమస్ సౌండ్ ఫీచర్ ని కూడా కలదు. ఈటీవీ ధర అక్షరాల రూ.4,99,999 రూపాయలు కలదు. ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ లో మాత్రమే అందుబాటులోనే ఉన్నది. ప్రపంచంలోనే మొదటిసారిగా త్రిపుల్ కలర్ టెక్నాలజీ ఉపయోగించిన స్మార్ట్ టీవీ గా పేరుపొందింది.వైడ్ కలర్ ,స్పోర్ట్స్ కోసం స్మూత్ మోషన్, ఫిలిం మేకర్ మోడ్ బ్లూటూత్ లైక్ టెక్నాలజీ అంటే అధునాతన ఫ్యూచర్లను ఈటీవీలో చేర్చడం జరిగిందట. ఇందులో ప్రాక్సిమిటీ సెన్సార్ తో మనం టీవీకి ఎంత దూరంలో ఉంటే ఆటోమేటిగ్గా అంత బ్రైట్నెస్ తగ్గించి మన కళ్ళను రక్షిస్తూ ఉంటుంది. ఇక ఇంట్లో థియేటర్ అనుభూతిని కల్పించడమే ఈ స్మార్ట్ టీవీ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నట్లుగా తెలుస్తోంది. ఇక త్వరలోనే అన్ని షో రూములలో ఈ స్మార్ట్ టీవీని విడుదల చేయబోతున్నట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసినట్లుగా తెలుస్తోంది. కానీ ఈ స్మార్ట్ టీవీ ధర చూస్తేనే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: