ప్రముఖ బ్రాండెడ్ కలిగిన ఇన్ ఫినిక్స్ మొబైల్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక ఈ బ్రాండ్ నుంచి సరికొత్త స్మార్ట్ టీవీలను కూడా విడుదల చేస్తోంది. అది కూడా ఆండ్రాయిడ్ -11 ఆపరేటింగ్ సిస్టంపై ఈటీవీ పనిచేయనుంది. ఈ స్మార్ట్ టీవీ 32 ,43అంగుళాల డిస్ప్లేను కూడా కలదు. ఈ స్మార్ట్ టీవీ యొక్క ధర ఫీచర్లను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇన్ ఫినిక్స్ బ్రాండెడ్ నుంచి వచ్చిన X-3 సిరీస్ గల స్మార్ట్ టీవీ ధర విషయానికి వస్తే రూ.8,999 గ నిర్ణయించారు ఫ్లిప్ కార్ట్  లో జులై 18 వ తేదీన ఈ స్మార్ట్ టీవీ సెల్ జరగనుంది. బ్లాక్ కలర్ ఆప్షన్ లో మాత్రమే ఈటీవీ దొరుకుతుంది ఎస్బిఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసే వారికి అదనంగా 10% డిస్కౌంట్ కలదు దీంతో రూ.8,000 వీళ్ళకి మనం ఈ స్మార్ట్ టీవీ ని తీసుకోవచ్చు.

ఇన్ ఫినిక్స్-32Y-1 టీవీ యొక్క స్పెసిఫికేషన్ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ టీవీ 32 ఇంచుల డిస్ప్లే కలదు దీని స్క్రీన్ రిజల్యూషన్ 1366X768  పిక్సెల్ గా ఉండబోతోంది. దీని చుట్టూ ఫ్రేమ్ కూడా బేజిల్ ఫ్రేమ్ కలదు. సన్నని డిజైన్తో ఈ స్మార్ట్ టీవీ విడుదల కాబోతోంది వీటితోపాటు బ్రైట్నెస్ 250 నిట్స్ గా ఉండబోతోంది. అంతేకాకుండా బ్రైట్నెస్ ను కూడా అడ్జస్ట్ చేసుకుని ఫ్యూచర్ కూడా ఇందులో కలదు.

512 RAM,4 GB స్టోరేజ్ మెమొరీ కలదు క్యాడ్ కోర్ ప్రాసెస్ పై ఈటీవీ పనిచేయనుంది. ఈటీవీలో అన్ని యాప్లు గాని ఉంటాయి దీని రిమోట్లో యూట్యూబ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన బటన్లు అమర్చడం జరిగింది. ఇక ఇందులోనే వైఫై తో పాటు 3HDMI పోర్టులు,2USB పోర్టులు, ఆప్టికల్ మిరా కాస్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా కలవు. అయితే అతి తక్కువ ధరకే ఈ స్మార్ట్ టీవీ లభిస్తోందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: