ఇక రోజురోజుకీ టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది. మన నిత్యజీవితంలో వాడేటివి కూడా శరీరానికి ఎక్కువగా పని చెప్పకుండా సులువుగా ఉండేలా ఎలక్ట్రిక్ పద్ధతిలో తయారు చేస్తున్నారు.ఒకప్పుడు మనవాళ్లు బయటకు వెళ్లాలంటే కేవలం సైకిల్ మీద వెళ్లేవారు. అలా సైకిల్ అనేది ప్రతి ఒక్కరి ఇంటిలో ఉండేది. అప్పట్లో సైకిల్ లేని ఇల్లు లేదంటే అది అతిశయోక్తి కాదు. అయితే తరువాత కొన్నాళ్లకు ద్విచక్ర వాహనాలు వచ్చాయి. వీటి వలన సైకిల్ ను ఉపయోగించే వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోయింది. పెట్రోల్ తో నడిచి వాహనాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ కాలంలో ద్విచక్ర వాహనం లేని ఇల్లు కూడా లేదు. అయితే పెట్రోల్ రేట్లు కూడా రోజురోజుకీ పెరుగుతున్నాయి.ఇంకా అలాగే పర్యావరణానికి కూడా చాలా హాని కలుగుతుంది.అందుకే వీటికి బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం బాగా కృషి చేస్తుంది.ఇప్పుడు ద్విచక్ర వాహన రంగంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇంకా అలాగే బైక్ లకు బాగా డిమాండ్ పెరిగింది. దీనివలన ఆటోమేకర్లు తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేసేందుకు ఇప్పుడు సిద్ధమవుతున్నారు. ఇందులో తక్కువ ధర నుంచి అధిక రేంజ్ వరకు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లను అనేక కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఇక అందులో ఒకటే ఒకాయ కంపెనీ. ఈ కంపెనీ మంచి ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేస్తుంది. 


వీటి ద్వారా బ్యాటరీ రేంజ్, ఫీచర్లు ఇంకా స్పెసిఫికేషన్స్ వంటి వివరాలను తెలిపింది. ఈ ఒకాయన ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ 72v,64Ah కెపాసిటీ లిథియం ఐయామ్ బ్యాటరీ ప్యాక్ కలదు. ఇక ఈ బ్యాటరీతో 1200w BLDC మోటార్ జత చేయబడింది. బ్యాటరీ చార్జింగ్ విషయానికి వస్తే..నాలుగు నుండి ఐదు గంటలు పూర్తిగా చార్జ్ అవుతుంది.అలాగే ఒకాయ ఫాస్ట్ స్కూటర్ ను ఒకసారి ఛార్జ్ చేస్తే గంటకు 140 నుంచి 160 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చని కంపెనీ తెలిపింది.ఇంకా ఈ స్కూటర్ గరిష్ట వేగం 60kmph వేగంతో వెళ్లవచ్చు అని కంపెనీ తెలిపింది. ముందు, వెనుక చక్రాలలో డ్రమ్ బ్రేకులు పెట్టబడ్డాయి. దీంతో అల్లాయ్ వీల్స్ ఇంకా ట్యూబ్ లెస్ టైర్లను జోడించారు.కంపెనీ ఈ స్కూటర్ ధరని మార్కెట్లో రూ. 99,000 తో విడుదల చేసింది. అయితే ఇక ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల ధర ఎక్కువగా ఉన్నాయి. ఇంకా అలాగే ఇండియాలో పెట్రోల్ వాహనాలతో పోల్చుకుంటే ఎలక్ట్రిక్ వాహనాలు ధరలు కూడా ఎక్కువ ఉన్నాయి. దీని వలన నిరుపేద ప్రజలు వీటిని కొనలేరు. అయితే రాబోయే రెండేళ్లలో అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరను తగ్గిస్తామని ఇటీవల కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ ఘట్కరి చెప్పారు. ఇంకా రెండేళ్లలో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ ధరలు సాధారణంగానే ఉంటాయి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: