ఇక వాట్సాప్ కొద్ది నెలల క్రితం డిసప్పియరింగ్ మెసేజెస్‌  పరిచయం చేసిన విషయం తెలిసిందే.ఇక ఈ ఫీచర్‌తో నిర్దిష్ట సమయంలో పంపినవారి చాట్‌తో పాటు రిసీవ్ చేసుకున్న వారి చాట్స్‌ నుంచి కూడా మెసేజ్‌లు అనేవి డిలీట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయడానికి ప్రతి చాట్‌ని ఓపెన్ చేసి టైమ్‌ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీచర్‌లోనే అన్ని కొత్త చాట్స్‌కు టైమ్‌ సెట్ చేసుకునేందుకు వీలుగా డిఫాల్ట్ మెసేజ్‌ టైమర్ (Default Message Time) కూడా వాట్సాప్ అందించింది. ఇప్పుడు ఈ డిఫాల్ట్ మెసేజ్‌ టైమర్‌లో సెలెక్ట్ చాట్స్ (Select Chats) అనే ఓ కొత్త షార్ట్‌కట్‌ను కూడా వాట్సాప్ తీసుకొస్తోంది. ఈ షార్ట్‌కట్‌తో ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ యాక్టివ్ చాట్స్‌కు డిసప్పియరింగ్ మెసేజెస్‌ అనేవి ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక ఈ ఫీచర్ సెలెక్టెడ్ బీటా టెస్టర్లకు విడుదలైంది. అలాగే త్వరలోనే స్టాండర్డ్ వెర్షన్‌లో కూడా రిలీజ్ అయ్యే అవకాశముంది.వాట్సాప్‌ బీటా ఇన్ఫో ఈ సరికొత్త ఫీచర్‌కు సంబంధించి స్క్రీన్‌షాట్‌తో పాటు ఆసక్తికర విషయాలు కూడా పంచుకుంది. ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్ 2.22.16.8 వాట్సాప్ బీటా వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చినట్లు తెలిపడం జరిగింది. ఇక ప్రస్తుతం వాట్సాప్‌లో అందుబాటులో ఉన్న డిఫాల్ట్ మెసేజ్‌ టైమర్‌తో కేవలం కొత్తగా స్టార్ట్ చేసే చాట్స్‌కి మాత్రమే డిసప్పియరింగ్ మెసేజెస్‌ అనేది ఎనేబుల్ అవుతుంది. అలాగే ఆల్రెడీ స్టార్ట్ చేసిన చాట్స్‌కి డిసప్పియరింగ్ మెసేజెస్‌ ఎనేబుల్ చేయాలంటే వాటిని ఒక్కొక్కటి ఓపెన్ చేసి ప్రత్యేకంగా టైమ్‌  అనేది సెట్ చేసుకోవాలి.


ఇక ఇది సమయంతో కూడుకున్న పని. అందుకే యూజర్ల సమయం వృథా కాకుండా డిఫాల్ట్ మెసేజ్‌ టైమర్‌లో సెలెక్ట్ చాట్స్ అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ కంపెనీ రోల్ అవుట్ చేస్తోంది.ఇక ఈ ఫీచర్‌తో ఒకటి కంటే ఎక్కువ చాట్‌లకు డిసప్పియరింగ్ మెసేజెస్‌ ఎనేబుల్ చేయడం మరింత సులభతరం అవుతుంది. ఇంకా కొత్తగా స్టార్ట్ చేసే చాట్స్‌ మాత్రమే కాదు ఆల్రెడీ స్టార్ట్ చేసిన లేదా యాక్టివ్ చాట్స్‌ ఇంకా గ్రూప్స్‌కి ఒకేసారి డిసప్పియరింగ్ మెసేజెస్‌ ఎనేబుల్ చేయడం సాధ్యమవుతుంది. దీనివల్ల మీకు కొంత సమయం కూడా ఆదా అవుతుంది. వాట్సాప్‌ బీటా ఇన్ఫో షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌ల ప్రకారం, కొత్త ఫీచర్ డిసప్పియరింగ్ మెసేజెస్‌లోని డిఫాల్ట్ మెసేజ్‌ టైమర్ ఆప్షన్స్‌లో కింద అందించడం అనేది జరుగుతుంది. "అప్లై థిస్ మెసేజ్ టైమర్ టు ఎగ్జిస్టింగ్ చాట్స్‌ బై సెలక్టింగ్ థెం" అని డిఫాల్ట్ మెసేజ్‌ టైమర్ ఆప్షన్స్‌లో ఈ కొత్త ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఇక ఆ ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా అన్ని యాక్టివ్ చాట్‌లు లేదా గ్రూప్స్ లిస్ట్‌ అనేది మీకు ఓపెన్ అవుతుంది. అప్పుడు యూజర్లు తమకు నచ్చిన చాట్స్ ని సెలెక్ట్ చేసుకొని మెసేజ్ టైమర్‌ను ఎనేబుల్ చేయవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ సందర్భంలో వేర్వేరు చాట్‌ల కోసం వేరే టైమర్‌ని సెట్ చేసే అవకాశం అనేది యూజర్లకు ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: