ప్రస్తుతం ప్రపంచమంతా ఎక్కువగా టెక్నాలజీ వైఫై అడుగులు వేస్తోంది. దీంతో ఆత్యాధునిక ఫీచర్లతో కూడిన సరికొత్త కంప్యూటర్లు ల్యాప్ ట్యాప్ లు , మొబైల్ మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. కరోనా కారణం చేత గడిచిన రెండు సంవత్సరాలు విద్యాసంస్థలు పూర్తిగా బంద్ అవ్వడంతో ఆక్రమంలో పలు కంపెనీ సంస్థలు విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వారి విద్యకు అవసరమయ్యే విధంగా కొన్ని ల్యాప్ టాప్ లను తయారు చేయడం జరిగింది. ప్రస్తుతం విద్యార్థులకు ఎక్కువగా కంప్యూటర్, మొబైల్, అనే పరికరాలు నిత్య పరికరాలుగా మారిపోయాయి. తాజాగా ఒక ప్రముఖ బ్రాండెడ్ కలిగిన సంస్థ నుండి ల్యాప్ టాప్ అతి తక్కువ ధరకే తయారు చేయడం జరిగింది వాటి గురించి చూద్దాం.


ఇన్ఫినిక్స్ బ్రాండెడ్ నుంచి విడుదలైన ఈ సరికొత్త ల్యాప్ టాప్ ఇండియాలో విడుదల చేయడం జరిగింది. ఇన్ఫినిక్స్ ఇండియా కంపెనీ తయారుచేసిన ల్యాప్ టాప్ అతి తక్కువ బడ్జెట్ లోనే విద్యార్థులకు తీసుకుని సదుపాయాన్ని కల్పిస్తోంది. కొద్దిరోజుల క్రితం  ఈ ల్యాప్ టాప్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇన్ఫినిక్స్ ఇన్ బుక్ ఎక్స్-1 నియో పేరుతో ఈ ల్యాప్ టాప్ ను మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. దీని ధర ప్రస్తుతం రూ.24,990 గా ఉన్నది.


 ఈ ల్యాప్ టాప్ పనితీరు కూడా చాలా సులువుగా ఉంటుంది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుందట. దీని బరువు 1.24 కిలోలు.. సైజు 14.8 MM గా కలదు ఇంటెల్ సెల్ క్వాడ్ కోర్NS -5100 ప్రాసెస్ తో కలదు. ఇక అంతే కాకుండా 8GB RAM+256 GB స్టోరేజ్ తో లభిస్తుందని ఇన్ఫినిక్స్ తెలియజేసింది. ముఖ్యంగా ఈ ల్యాప్ టాప్ విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుందని తెలియజేశారు దీనిని అల్యూమినియం మెటల్ బాడీ తో తయారు చేయడం జరిగిందట. ఈనెల 21 నుంచి ఫ్లిప్ కార్ట్ లో ఈ ల్యాప్ టాప్  సేల్ జరుగుతున్నట్లుగా ఆ సంస్థ తెలియజేశారు. ఇక వీటిపై కూడా పలు ప్రత్యేకమైన ఆఫర్లు ఉన్నట్లు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: