అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉండనే ఉంటాయి.. అయితే కొంతమంది మాత్రం ఎక్కువగా మార్కెట్లోకి ఏదైనా కొత్త మొబైల్ వచ్చింది అంటే చాలు వాటిని తీసుకోవడానికి చాలా మక్కువ చూపిస్తూ ఉంటారు. అలాంటివారు తమ వాడుతున్న మొబైల్ ని సగం ధరకే అమ్మేస్తూ ఉంటారు. అయితే అలా ఒకరు వాడిన మొబైల్ ని తనిఖీ చేయకుండా తీసుకున్నట్లు అయితే మనం చాలా ప్రమాదంలో పడినట్లే.. ఎందుచేత అంటే తక్కువ ధరకే వస్తోంది కదా అని తొందరపడి ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నట్లయితే మనం తీసుకున్న మొబైల్ ఒరిజినల్ ఓనర్ గా కాదా.. అది దొంగలించబడిందా అనే విషయాన్ని ముందుగా నిర్ధారించుకోవాలి. అలా నిర్ధారించుకోవాలి అంటే ఇలా చేస్తే సరి..డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్..DOT పోగొట్టుకున్న, దొంగలించబడిన మొబైల్ ట్రాక్ చేయడానికి. CEIR అనే ఒక కోటర్ ని విడుదల చేశారు ఈ పోర్టల్ నుండి మనం తీసుకోబోతున్న మొబైల్ యొక్క వివరాలను చెక్ చేసుకోవడం మంచిది.


మనం తీసుకోబోతున్న మొబైల్ యొక్క వివరాలను ఎలా చెక్ చేసుకోవాలి అంటే..IMEI నెంబర్ తో పాటు మొబైల్ యొక్క ఒరిజినల్ దా డూప్లికేట్ లేదా ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా అక్కడ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఎలా తెలుసుకోవాలలో చూద్దాం.

1). ముందుగా మనం CEIR అనే పోర్టల్ లోకి వెళ్ళాలి..
2). అక్కడ మెయిన్ ఇమేజ్ లో అప్లికేషన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయవలసి ఉంటుంది.
3). ఆ తర్వాత అక్కడ మీకు KNOW YOUR mobile APP  లేకపోతే IMEI VERIFICATION అనే ఆప్షన్లు కనిపిస్తాయి.
4). అందులో మనం IMEI అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత అక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటిపీ ఎంటర్ చేయాలి.
5). అక్కడ మీIMEI  నెంబర్ కోసం సూచించిన బాక్సులు మనకు ఇమేజ్ నెంబర్ ఎంటర్ చేయాలి. అక్కడ IMEI  నెంబర్ సబ్మిట్ చేసిన వెంటనే మనకు పూర్తి వివరాలు తెలుస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: