ఇక వేగవంతమైన 5జీ టెలికం సర్వీసులకు సంబంధించి మంగళవారం ప్రారంభమైన స్పెక్ట్రం వేలానికి భారీ స్పందన లభించింది.5జీ స్పెక్ట్రమ్ (5G spectrum) వేలం(Auction)లో భాగంగా మొదటి రోజు ఏకంగా రికార్డు స్థాయిలో మొత్తం కూడా రూ.1.45 లక్షల కోట్ల విలువైన బిడ్లు దాఖలవ్వడం జరిగింది. ఇక తొలి రోజు నాలుగు రౌండ్లు ముగిశాయని కూడా కేంద్ర టెలికం మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.700 ఎంహెచ్‌జెడ్(MHz) బ్యాండ్ ఫ్రీక్వెన్సీల కోసం బిడ్లు వచ్చాయని మీడియాకు వివరించడం జరిగింది. ఈ మేరకు ఆయన ఢిల్లీలో మంగళవారం నాడు మాట్లాడారు. వేలం తర్వాత స్పెక్ట్రం కేటాయింపులను దృష్టిలో ఉంచుకుని తమ బృందం ఎక్కువ సమయం పనిచేస్తోందని, ఆగస్టు 15, 2022 నాటికల్లా దేశంలోని అత్యధిక నగరాల్లో 5జీ సర్వీసులు అనేవి ఆరంభమవుతాయని మంత్రి అశ్వని వైష్ణవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా మొత్తం రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72 గిగాహెర్ట్జ్‌ల 5జీ స్పెక్ట్రాన్ని ప్రభుత్వం వేలంలో ఉంచిందని ఇంకా 5వ రౌండ్ వేలం బుధవారం నాడు ముగుస్తుందని ఆయన చెప్పారు. 


కేటాయింపులు ఆగస్టు 15 వ తేదీ లోగా పూర్తవుతాయని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. డిమాండ్‌ను బట్టి వేలం ఎన్ని రోజులు కొనసాగుతుందనేది కూడా తేలుతుందన్నారు.ఇండియన్ బిలియనీర్ ముకేష్ అంబానీ(Mukesh Ambani)కి చెందిన రిలయన్స్ జియో(Reliance Jio), అలాగే సునీల్ మిట్టల్(Sunil Mittal) సారధ్యంలోని భారతీ ఎయిర్‌టెల్(Bharati Airtel),ఇంకా అపర కుబేరుడు గౌతమ్ అదానీ(Gautham Adani)కి చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్(Adani Enterprises) ఈ 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొనడం జరిగింది. కాగా 5జీ స్పెక్ట్రం వేగం అనేది 4జీ కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇంకా కనెక్టివిటీ విషయంలో అవాంతరాలు కూడా వైదొలుగుతాయి. సమాచారాన్ని చాలా వేగంగా షేర్ చేసుకునేందుకు వీలుగా కొట్లాది డివైజులు అనుసంధానించడం కూడా సాధ్యమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

5G