ఇటీవల కాలంలో ప్రపంచం మొత్తం ఆన్లైన్ మాయలో మునిగితేలుతోంది అన్న విషయం తెలిసిందే.  ఇప్పుడు సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ టెక్నాలజీని అలవాటు పడటానికి ఇష్టపడుతూ ఉన్నారు. అయితే ఒకప్పుడు ఎవరికైనా ఏదైనా సమాచారం చేరవేయాలి అంటే ఉత్తరాల ద్వారానే చేరవేసేవారు. కానీ ఇటీవల కాలంలో ఎన్నో ఆన్లైన్ మెసేజింగ్ యాప్ ద్వారా  ఒక క్లిక్ చేస్తే చాలు అరక్షణంలో సమాచారం చేరిపోతూ ఉంటుంది. ఇక ఇటీవల కాలంలో ఎక్కువగా వినియోగంలో ఉన్న ఆన్లైన్ మెసేజింగ్ యాప్ ఏది అంటే ఇండియాలో ప్రతి ఒక్కరు చెప్పేది మాత్రం వాట్సాప్ అని.


 ఇలా ఆన్లైన్లో మెసేజెస్ చేసుకోవడానికి ఎన్నో యాప్స్ ఉన్నాయి. కానీ వాట్సాప్ కి మాత్రం ప్రత్యేక స్థానం అని చెప్పాలి. స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ వాడుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. వాట్సాప్ సైతం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకువస్తూ తమ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెంచుకుంటుంది. అదే సమయంలో ఇక వినియోగదారుల రక్షణ ప్రైవసీ  విషయంలో కూడా ఎంతో కచ్చితత్వంతో వ్యవహరిస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవలే వాట్సాప్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది అని తెలుస్తోంది.


 ఏకంగా ఒక్క నెలలోనే 22 లక్షల వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక జూన్ నెలలో ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఇన్ఫర్మేషన్ రూల్స్ 2021 ప్రకారం వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరణ ఇచ్చింది. ఇటీవలే సోషల్ మీడియా వేదికగా తెలిపింది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం అనధికారిక మెసేజ్లను ఎక్కువ కాంటాక్ట్ లకు ఫార్వర్డ్ చేయడం లాంటివి చేసిన వారి ఖాతాలను వాట్సాప్ బ్యాన్ చేసిందట. కాగా అంతకుముందు మే నెలలో కూడా 19 లక్షలకు పైగా వాట్సాప్ అకౌంట్ లను బ్యాన్ చేసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ విషయం తెలిసి ప్రతి ఒక్క వాట్సప్ వినియోగదారులడు కూడా అప్రమత్తం అవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: