రోజురోజుకీ టెక్నాలజీలో ఎన్నో రకాల మార్పులు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి మార్పులు అటు మనిషికి ఎంతగానో ఉపయోగకరంగా మారిపోతున్నాయి. సరికొత్త ఆవిష్కరణలు మనిషి జీవన శైలిని పూర్తిగా మార్చేస్తూ ఉన్నాయి. అయితే ఒకప్పుడు మనిషికి ఏదైనా కావాలి అంటే బయట ఎక్కడికో దుకాణం కి వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇటీవలి కాలంలో టెక్నాలజీ పెరిగిపోయిన నేపథ్యంలో ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు. అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఒక్క క్లిక్ ఇస్తే చాలు మనకు కావలసిన అన్ని రకాల వస్తువులు కూడా ఇంటికి వచ్చి వాలి పోతున్నాయి.


 వెరసి అధునాతన టెక్నాలజీ కారణంగా  వస్తున్న మార్పులు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇటీవల కాలంలో ప్రతి మనిషి జీవితంలో డ్రోన్ అనేది ఎంతో కీలకం గా మారిపోయింది. మొన్నటివరకు రక్షణ రంగంలో ఇక శత్రువుల కదలికలను కనుగొనడానికి మాత్రమే డ్రోన్లను ఉపయోగించే వారు. కానీ ఇప్పుడు ఏకంగా మినీ బాంబులను మోసే డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.  మరోవైపు పెళ్ళిళ్ళు శుభకార్యాలు కూడా ఉపయోగిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో అయితే మెడిసిన్స్ తరలించేందుకు కూడా డ్రోన్లు అందుబాటులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇప్పుడు కేవలం వస్తువులను కాదు ఏకంగా మనుషులను తరలించే డ్రోన్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది అన్నది తెలుస్తుంది.  ఏకంగా మనిషిని మోసుకెళ్ల కలిగిన సామర్థ్యంతో ఓ డ్రోన్ రూపొందించినట్లు పుణేకు చెందిన సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ డ్రోన్ కి వరుణ అనే ఒక పేరు కూడా పెట్టింది. దీనిపై డెమో కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. దాదాపు 130 కిలోల బరువు గల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుందట. అత్యవసర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి రోగులను త్వరగా తరలించేందుకు ఈ డ్రోన్ ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు.

మరింత సమాచారం తెలుసుకోండి: