నోకియా 1100 మొబైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆండ్రాయిడ్ ఫోన్లో అందుబాటులోకి రాకముందు ఈ మొబైల్స్ ప్రతి ఒక్కరు ఉపయోగించుకునేవారు. ఇప్పటికే కొంతమంది తాము వాడిన మొబైల్ ఫోన్ ఏమిటంటే టక్కున వీటి గురించి చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఇదే తరహాలో నోకియా 1100 తరహాలో సరికొత్త టెక్నాలజీతో తమ కస్టమర్ల కోసం అధునాతన టెక్నాలజీతో త్వరలోనే అందుబాటులోకి వచ్చింది నోకియా 110 మోడల్ మొబైల్ మనదేశంలో మూడు రంగులలో లభిస్తుంది.


రంగుల ఆధారంగా మొబైల్ ధరలు స్వల్ప మార్పులు కూడా ఉన్నాయి. రూ.1699 రూపాయలు గల మొబైల్ కొనుగోలు చేస్తే రూ.299 విలువ గల ఇయర్ ఫోన్స్ ఉచితంగా పొందవచ్చు. నోకియా 110 మొబైల్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఈ మొబైల్ కంపెనీ నుంచి విడుదల చేయబడిన సరికొత్త మొబైల్ ఆటో కాల్ రికార్డింగ్ ఆప్షన్ తో పాటు వెనుక వైపుగా ఇన్ బుల్ట్ రేర్ కెమెరాతో పాటు టాప్ ఎడ్జ్ లో ఎల్ఈడి ఫ్లాష్ లైట్ తో కూడా కలదు. ఇక అంతే కాకుండా వీటితోపాటు మ్యూజిక్ ప్లేయర్  కూడా అందుబాటులో ఉంచనుంది.

ఇక ఇందులో మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ కూడా అందుబాటులో ఉంచారు దీని ద్వారా మొబైల్ డేటా స్టోరేజ్ ను 32gb వరకు మనం పెంచుకోవచ్చు స్నేక్ గేమ్ తో సహా మరికొన్ని గేమ్స్ కూడా అందుబాటులో ఉంచారు వైర్లెస్ ఎఫ్ఎం వంటి ఫీచర్లు కూడా ఈ మొబైల్లో కలవు.1000 mah సామర్థ్యం గల బ్యాటరీ కూడా ఈ మొబైల్ లో కలదు. ఈ మొబైల్లో 8 వేలకు పైగా పాటలను స్టోర్ చేసుకుని సామర్ధ్యం కలదు. ఈ మొబైల్ ఎడిషన్ ఫ్యూచర్ తో పాటు నోకియా 8120 -4g ఫ్యూచర్ ఫోన్ కూడా భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది ఈ రెండు ఫోన్లు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా సరికొత్త డిజైన్తో కలదు

మరింత సమాచారం తెలుసుకోండి: