మొబైల్ వాడే కస్టమర్లకు చాలా చౌకైన రీఛార్జ్ ప్లాన్ పరిచయం చేసింది జియోనే.దెబ్బకు అన్ని టెలికామ్ సంస్థలకు బుద్ది వచ్చింది.ఇక 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని మరింత ప్రత్యేకంగా జరుపుకునేందుకు ముఖేష్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.750 కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది.ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌తో, మీరు ఏ నెట్‌వర్క్‌లోనైనా కూడా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలతో పాటు ప్రతిరోజూ 2 GB హై-స్పీడ్ డేటాను పొందుతారు. ఈ జియో ప్లాన్‌తో కంపెనీ మొత్తం 90 రోజుల పాటు వ్యాలిడిటీ అందిస్తోంది. రోజుకు 2 GB ప్రకారం ఈ ప్లాన్ మీకు మొత్తం 180 GB హై-స్పీడ్ డేటాను కూడా అందిస్తుంది.అలాగే జియో ఫైబర్ వినియోగదారులకు కూడా ప్రత్యేకత ఉంది. ఇంకా దీంతో పాటు, రిలయన్స్ జియో ‘హర్ ఘర్ త్రివర్ణ హర్ ఘర్ జియోఫైబర్’ నినాదాన్ని కూడా లేవనెత్తుతోంది కంపెనీ.అలాగే జియో ఫైబర్ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను కూడా తీసుకువచ్చింది. 


జియో ఆఫర్ కింద ఆగస్టు 12, ఆగస్టు 16 మధ్య కొత్త జియో ఫైబర్ కనెక్షన్‌ని బుక్ చేసుకున్న వినియోగదారులు మొత్తం 15 రోజుల ఉచిత ప్రయోజనాలను పొందుతారు. కానీ మీరు JioFiber పోస్ట్‌పెయిడ్ ఎంటర్‌టైన్‌మెంట్ బొనాంజాతో రీఛార్జ్ ని చేసినప్పుడు మాత్రమే మీరు ఈ ప్లాన్ ప్రయోజనాన్ని పొందుతారు.ఇక ఈ ప్రయోజనం కంపెనీ ప్రస్తుత వినియోగదారులకు మాత్రమే కాదు.. కొత్త కనెక్షన్ తీసుకునే వినియోగదారులకు కూడా. 15 రోజుల ఉచిత ప్రయోజనాన్ని పొందడానికి మీరు రూ. 499, రూ. 599, రూ.799 ఇంకా రూ. 899 ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకోవాలి. మీ ప్రజల సమాచారం కోసం మీరు 6 నెలలు లేదా 12 నెలల ప్లాన్‌తో రీఛార్జ్ చేసినప్పుడు మాత్రమే ఈ ఆఫర్ ప్రయోజనం అనేది అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: