వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి.. అకస్మాత్తుగా వచ్చె ప్రమాదాలను అరికడుథుంది. అందుకే హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదం అని పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ హెల్మెట్ వల్ల లాభాల తో పాటు నష్టాలు కూడా ఉన్నాయని కొందరు వాపొతున్నారు.. బైక్‌ నడిపేటప్పుడు రైడర్లు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య హెల్మెట్‌. దీని కారణం గా చాలా అసౌకర్యానికి గురవుతారు. ఎందుకంటే హెల్మెట్‌ పెట్టుకున్న కొద్ది సేపటికే తల మొత్తం ఉక్కపోతగా ఉంటుంది..



అందరు బైక్‌ రైడర్లు ఎదుర్కొనే సమస్య ఇది. అయితే ఇప్పుడు మార్కట్‌లోకి ఒక కొత్త హెల్మెట్‌ వచ్చింది. దీనిని ధరిస్తే ఎలాంటి ఉక్కపోత ఉండదు.. తల మొత్తం చల్లగా ఉంటుంది. దీనిని కూలింగ్‌ హెల్మెట్‌గా చెప్పవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రైడింగ్ చేసేటప్పుడు కూలింగ్ హెల్మెట్ బాగా ఉపయోగ పడుతుంది. ఇందులో ఒక పరికరం అమరుస్తారు. ఇది హెల్మెట్‌ను చల్ల బరుస్తుంది. ఒక్క నిమిషం కూడా వేడిలో ప్రయాణించినట్లు అనిపించదు. 



కూలింగ్ హెల్మెట్ పరికరాలని తయారు చేసే కంపెనీలు మార్కెట్లో అనేకం ఉన్నాయి. వీటిలో బ్లూ ఆర్మర్ అనే కంపెనీ ఒకటి. ఇది ఈ పరికరాన్ని తయారు చేస్తుంది. ధర రూ.1,999, 2,299 నుంచి రూ.4,999 వరకు దీని ఉంటుంది. నిజానికి ఈ హెల్మెట్ బ్యాటరీ తో నడుస్తుంది. ఇందు లో బలమైన ఫ్యాన్ వ్యవస్థ ఉంటుంది. దీంతో పాటు శక్తివంతమైన మోటారు ఉంటుంది. దీంతో పాటు వినియోగ దారులు బలమైన ప్లాస్టిక్ బాడీని పొందుతారు. ఇది తేమను సమతుల్యం చేస్తుంది. అద్భుతమైన చల్లదనాన్ని ఇస్తుంది. అయితే ఇలాంటి హెల్మెట్లు కొనుగోలు చేసేముందు ఆలోచించడం అవసరం. అన్ని విషయాలు పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతనే కొనడం మంచిదని నిపుణులు అంటున్నారు.. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ హెల్మెట్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ వుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: