ప్రముఖ బ్రాండెడ్ అయిన వన్ ప్లస్ సంస్థ పలు మొబైల్స్ ను వరుసగా విడుదల చేస్తూ తమ కస్టమర్లను బాగా ఆకర్షిస్తోంది. మొన్నటి వరకు లో బడ్జెట్ మొబైల్ ను కూడా విడుదల చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా సమకూర్చడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ వన్ ప్లస్ కంపెనీ ప్రీమియం మొబైల్స్ ను తీసుకురావడం జరిగింది.one plus -10 R పేరుతో ఒక మొబైల్ ని విడుదల చేసింది ఈ మొబైల్ ఇండియాలో తాజాగా అందుబాటులోకి రావడం జరిగింది. ఈ స్మార్ట్ మొబైల్ 5-G నెట్వర్క్ తో పనిచేస్తుంది. ఇక ఈ స్మార్ట్ మొబైల్ యొక్క ఫీచర్ల , ధర గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.



One plus -10R 5g మొబైల్ మీడియా టెక్ 8100 మ్యాక్స్  ప్రాసెస్ తో పనిచేస్తుందట. ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.7 అంగుళాలు హెచ్డి LED డిస్ప్లేను కలదు. ఈ స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం 2.5 కర్వాడ్ కార్వింగ్ గొరిల్లా గ్లాస్ కూడా ఈ మొబైల్ పైన ప్రొటెక్షన్ గా అందిస్తోంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం ద్వారా పనిచేయడం జరుగుతుంది.ఇక బ్యాటరీ ప్రాధాన్యత విషయానికి వస్తే ఈ మొబైల్ 150 W ఫాస్ట్ ఛార్జింగ్ తో సపోర్ట్ చేస్తుంది బ్యాటరీ విషయానికి వస్తే 5000MAH సామర్థ్యంతో కలదు.

కెమెరా విషయానికి వస్తే వెనుక భాగాన 50 మెగా పిక్సెల్ కెమెరాతోపాటు సెల్ఫీ ప్రియుల కోసం 16 మెగా ఫిక్స్ ఫ్రంట్ కెమెరా కలదు. ఇక అంతే కాకుండా ఈ మొబైల్ 5g,4G రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. వైఫై-6, బ్లూటూత్-5.2 వర్షన్ తో కలదు. ఈ స్మార్ట్ మొబైల్ అసలు ధర విషయానికి రూ.38,999 రూపాయలు ఉండగా ప్రస్తుతం ఈ మొబైల్ అమెజాన్ లో ఆఫర్ కింద 32,999 రూపాయలకి లభిస్తోంది అయితే sbi కార్డుతో అదనంగా మరొక రూ.2000 రూపాయల వరకు తగ్గింపు లభిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: