వాట్సాప్: మరో సూపర్ ఫీచర్.. ఇక ఆ ఎడిటింగ్ కూడా?

వాట్సాప్‌ మెసేజింగ్ యాప్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా డెవలప్ అయ్యాక వాట్సాప్ చాలా వేగంగా దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం వాట్సాప్ కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది కాబట్టే ఈ యాప్‌కు అంతటి ప్రాధాన్యత.అందుకే నెంబర్ వన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యాప్ గా దూసుకుపోతుంది వాట్సాప్.ప్రత్యర్థి సంస్థల నుంచి ఎంత పోటీ ఎదురైనా వాట్సాప్‌ మొదటి స్థానంలో నిలవడమే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పటికే పలు ఆకట్టుకునే ఆఫర్లతో యూజర్లను అట్రాక్ట్ చేస్తూ వస్తోన్న వాట్సాప్‌ తాజాగా మరో ఆకస్తికరమైన ఫీచర్‌ను యూజర్లకోసం తీసుకొచ్చింది. సాధారణంగా వాట్సాప్‌లో ఎవరికైనా మెసేజ్‌ చేస్తే ప్రస్తుతం డిలీట్‌ చేసుకునే అవకాశం మాత్రమే ఉంది. అలా కాకుండా అప్పటికే సెండ్ చేసిన మెసేజ్‌ను ఎడిట్‌ చేసే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది.?ఫీచర్‌ ఉపయోగం భలే ఉంది కదా!



తాజాగా వాట్సాప్‌ ఈ ఫీచర్‌పై టెస్టింగ్ చేస్తోంది. తొందరపాటులో పంపిన మెసేజ్‌లో ఏవైనా తప్పులు దొర్లితే.. ఇకపై మెసేజ్‌ను డిలీట్‌ చేసి, మళ్లీ కొత్త మెసేజ్‌ పంపాల్సిన అవసరం లేకుండా ఈ కొత్త ఫీచర్‌ ఉపయోగపడనుంది. ఎడిట్‌ మెసేజ్‌ ఫీచర్‌ పేరుతో తీసుకొస్తున్న ఈ అప్‌డేట్‌ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. విజయవంతంగా పరీక్షలు పూర్తికాగానే యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే వాట్సాప్‌ ఇటీవలే డిలిట్ ఫర్‌ ఎవ్రీవన్‌ ఫీచర్‌ సమయాన్ని పెంచిన విషయం తెలిసిందే. వీటితో పాటు ప్రైవసీలో భాగంగా ప్రొఫైల్‌ ఫొటో ఎవరికి కనిపించాలో వారికే కనిపించేలా చేసుకునే అవకాశం కూడా కల్పించారు.ఇలా యూజర్లకు అందుబాటులో ఇంకా అలాగే ఆకట్టుకునే ఫీచర్లతో వాట్సాప్ చాలా వేగంగా దూసుకుపోతుంది.కాబట్టి హ్యాపీగా వాట్సాప్ ని వినియోగించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: