ఇండియన్ ఆటోమొబైల్ హిస్టరీలో ఎప్పటికీ గుర్తుండిపోయే బ్రాండ్ ఎల్ఎంఎల్ (LML). టూ వీలర్ మార్కెట్లో ఓ వెలుగు వెలిగిన ఈ బ్రాండ్ ఇప్పుడు తిరిగి భారతదేశంలో రీ-ఎంట్రీ ఇచ్చింది.చరిత్రలో కలిసిపోయిన జావా, యెజ్డి వంటి మోటార్‌సైకిల్ బ్రాండ్లు తిరిగి మార్కెట్లోకి ప్రవేశించి విజయం సాధించినట్లుగానే, ఎల్ఎంఎల్ కూడా భారతదేశంలో తన రీ-ఎంట్రీ లక్‌ను పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది.అయితే, జావా ఇంకా యెజ్డి బ్రాండ్ల మాదిరిగా ట్రెడిషన్ టూవీలర్లను కాకుండా, ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ టూవీలర్లతో రీ-ఎంట్రీ ఇచ్చింది.ఎల్ఎంఎల్ మూడు ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేసింది. వీటిలో స్టార్ (Star), మూన్‌షాట్ (Moonshot) ఇంకా ఓరియన్ (Orion) బ్రాండ్లు ఉన్నాయి. వీటిలో ఎల్ఎంఎల్ స్టార్ అనేది మోడ్రన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాగా, ఎల్ఎంఎల్ మూన్‌స్టార్ ఆఫ్-రోడ్ అడ్వెంచర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మాదిరిగా ఉంటుంది. కాగా, ఎల్ఎంఎల్ ఓరియన్ అనేది ఎలక్ట్రిక్ సైకిల్‌గా ఉంటుంది. ఈ మూడు మోడళ్లు వచ్చే ఏడాది ద్వితీయార్థం నాటికి ఇండియన్ మార్కెట్లో అమ్మకానికి రానున్నాయి.ఎల్ఎంఎల్ ఉత్పత్తులు కేవలం భారతదేశంలోనే కాకుండా యూరోపియన్ ఇంకా అమెరికన్ మార్కెట్‌లలో కూడా విక్రయించబడనున్నాయి. ఎల్ఎంఎల్ తమ పాత స్టార్ స్కూటర్ నేమ్ ప్లేట్‌ను తిరిగి తమ అధునాతన 2023 ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఉపయోగించనుంది.


గతంలో కంపెనీ ఎల్ఎంఎల్ స్టార్ పేరుతో పెట్రోల్ తో నడిచే ఓ క్లాసిక్ స్కూటర్‌ను విక్రయించేది. ఇప్పుడు అదే పేరుతో ఈ అధునాతన ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఎల్ఎంఎల్ రీలాంచ్ చేసేందుకు రెడీ అయ్యింది.ఎల్ఎంఎల్ స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ షార్ప్ గా కనిపించే ఫ్యూచరిస్టిక్ ఎడ్జీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీని ఫ్రంట్ ఫాసియాపై స్టార్ కస్టమ్ టెక్స్ట్ మెసేజ్‌ను పెర్ఫార్మ్ చెయ్యడానికి ఉపయోగించే డిస్ప్లే ప్యానెల్‌ను కూడా ఉంటుంది. ఇతర డిజైన్ ఫీచర్లలో స్టెప్డ్ సీట్, మందపాటి గ్రాబ్ రైల్స్ మరియు మందపాటి ఫ్లోర్‌బోర్డ్ ఉన్నాయి. బహుశా ఈ ఫ్లోర్ బోర్డులేనే స్కూటర్  బ్యాటరీ ప్యాక్ ఉంచబడుతుందని తెలుస్తోంది.ఎల్ఎంఎల్ స్టార్‌ ఇ-స్కూటర్ లో ముందు వైపు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక వైపున మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఇంకా ఇరువైపులా డిస్క్ బ్రేక్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. రెండు వైపులా అల్లాయ్ వీల్స్ ఉండటాన్ని కూడా మనం గమనించవచ్చు. ప్రస్తుతానికి, కంపెనీ ఈ టూవీలర్ల డిజైన్‌ను మాత్రమే వెల్లడి చేసింది. వీటిలో ఉపయోగించిన బ్యాటరీ ప్యాక్స్ ఇంకా అలాగే ఇతర సాంకేతిక వివరాలను ఇంకా వెల్లడించలేదు. వచ్చే ఏడాది నాటికి ఎల్ఎంఎల్ ఇ-స్కూటర్ కు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

LML