బెంగళూరుకి చెందిన ఆటోమోటివ్ స్టార్టప్ కంపెనీ 'ప్రవైగ్'  తన ఫస్ట్  ఎలక్ట్రిక్ SUV అయిన 'డిఫై' ని లాంచ్ చేసింది.ఈ కొత్త 'ప్రవైగ్ డిఫై'  ధర రూ. 39.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. కంపెనీ ఈ SUV కోసం బుకింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. కాబట్టి ఆసక్తి కలిగిన కస్టమర్లు రూ. 51,000 పే చేసి బుక్ చేసుకోవచ్చు. అయితే డెలివరీలు 2023 ఏప్రిల్ నాటికి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. డిజైన్  విషయానికి వస్తే కొత్త ప్రవైగ్ డిఫై ఎలక్ట్రిక్ SUV బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో లైట్‌బార్ స్టైల్ హెడ్‌లైట్‌లు తప్ప ఫ్రంట్ ఎండ్ దాదాపు పూర్తిగా క్లోజ్ చెయ్యబడింది.ఇంకా అంతే కాకుండా.. ముందు ఇంకా వెనుక విండ్‌స్క్రీన్‌లు లాలాగే కూపే వంటి రూప్ కలిగి ఉంటుంది.ఇందులో పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్‌ కూడా  ఉంటుంది. అలాగే ఇంటిగ్రేటెడ్ రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్‌, టెయిల్‌గేట్ ఇంకా లైట్‌బార్ స్టైల్ టైల్‌లైట్‌లు ఉంటాయి.అలాగే ఈ కారులో 15.6 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ కార్ ఫ్రెంచ్ ఆడియో స్పెషలిస్ట్ బ్రాండ్ డెవియలెట్ నుండి 3D సౌండ్‌ ను పొందుతుంది.


సీట్లు సిక్స్ వే పవర్ అడ్జస్ట్‌మెంట్ ఇంకా అలాగే వెంటిలేషన్‌ను పొందుతాయి. ఈ కార్ లో 1,050 మిమీ హెడ్‌రూమ్ ఇంకా అలాగే 1,215 మిమీ లెగ్‌రూమ్‌ ఉండటం వల్ల ప్రయాణికులు చాలా కంఫర్ట్ గా ఉండవచ్చు.స్పెషల్ క్లైమేట్ కంట్రోల్ జోన్‌లు ఇంకా ఇంటీరియర్‌లకు కనెక్ట్ చేయబడిన కార్ యాప్ ద్వారా ముందే కండిషన్ చేయవచ్చు. మల్టిపుల్ వైర్‌లెస్ ఛార్జర్‌లు ఇంకా ల్యాప్‌టాప్‌లను ఛార్జ్ చేయగల రెండు హై-పవర్ USB-C పోర్ట్‌లు ఈ కారులో ఉంటాయి.ఇంకా అంతే కాకుండా ఈ కార్ ప్రత్యేకమైన కీ కార్డ్‌తో వస్తుంది. అందువల్ల కనెక్టెడ్ కార్ టెక్ ద్వారా లాక్/అన్‌లాక్ చేయవచ్చు.కొత్త ప్రవైగ్ డిఫై 402 బిహెచ్‌పి ఇంకా 620 ఎన్ఎమ్ టార్క్ టార్క్‌ అందించే రెండు ఎలక్ట్రిక్ మోటార్‌ల ద్వారా పవర్ ని పొందుతుంది. ఈ కార్  4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు స్పీడ్ గా వెళ్ళగలదు. టాప్ స్పీడ్  వచ్చేసి 210 కిమీ/గం. ఈ కారులో ఒక పెద్ద 90.2 kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. అందువల్ల ఈ కార్  ఒక ఛార్జ్‌పై 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: