వన్ ప్లస్ అద్భుతమైన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తూ.. కష్టమర్లను మరింత ఆకట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది.  ఈ క్రమంలోనే రకరకాల టెక్నాలజీతో కూడిన స్మార్ట్ఫోన్లను ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశ పెడుతూ.. మరింత డిమాండ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో తాజాగా వన్ ప్లస్ మరొక స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఇదివరకే వన్ ప్లస్ 11 పేరిట స్మార్ట్ ఫోన్  మార్కెట్లోకి విడుదల చేసింది.  మరి ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రత్యేక ఫ్యూచర్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఈ కొత్త ఫోన్ లాంచ్ అయ్యి నెల కూడా గడవక ముందే ఇంతలో వన్ ప్లస్ నార్డ్ CE 3 ఫోన్ ఫోటోలు కూడా ఆన్లైన్లోకి వచ్చేసాయి. ఇకపోతే వన్ ప్లస్ నార్డ్ CE 3 ను  తాజాగా విడుదల చేయడానికి సిద్ధం చేస్తోంది వన్ ప్లస్. అలాగే ట్రిపుల్ కెమెరా సెట్ అప్ యూనిసోక్ చిప్ సెట్ తో సహా పలు ప్రత్యేక ఫీచర్లతో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఆన్లైన్లో లీకైన ప్రత్యేక ఫీచర్ల విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే డిజైన్ ను కలిగి ఉంటుంది.120 Hz రీ ఫ్రెష్ రేటు, 1080 పిక్సెల్ మరియు మెరుగైన భద్రతతో లాంచ్ చేయబడుతుందని చెప్పబడింది.


ముఖ్యంగా ఈ ఫోన్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంది అని క్వాల్కం స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్ ద్వారా శక్తిని పొందుతుందని సమాచారం.  ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా ఈ స్మార్ట్ ఫోన్ విడుదల అవుతోంది.  ఇక కెమెరా విషయానికి వస్తే 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా,  2 మెగాపిక్సల్ డెప్త్ కెమెరా తో 2 మెగా పిక్సెల్ మైక్రో కెమెరాలు అందుబాటులో ఉన్నాయి.  అలాగే సెల్ఫీ కోసం 16 మెగా పిక్సెల్ కెమెరాని కూడా అమర్చారు.67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: