గతంలో ఎక్కువగా అందరూ నోకియా బ్రాండెడ్ మొబైల్స్ ని ఎక్కువగా ఉపయోగించేవారు. అయితే ఈ మధ్యకాలంలో ఆండ్రాయిడ్ మొబైల్స్ కి అలవాటు పడ్డవారు ఈ మొబైల్స్ డిమాండ్ పూర్తిగా తగ్గిపోయిందని చెప్పవచ్చు. నోకియా బ్రాండెడ్ నుంచి ఆండ్రాయిడ్ మొబైల్స్ ,OS మొబైల్స్ విడుదలైనా కూడా పెద్దగా కస్టమర్లను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈ మొబైల్ బ్రాండ్ హవ కాస్త తగ్గిపోయిందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికీ తమ హావ మార్కెట్ల కొనసాగించాలని పలు సరికొత్త బ్రాండ్లను సైతం మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి పలు ప్రయత్నాలు చేస్తుంది నోకియా సంస్థ.


ఇప్పుడు తాజాగా నోకియా నుండి మరొక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చిందట. ఈ స్మార్ట్ ఫోన్ ఆకర్షణమైనా డిజైన్ సింగిల్ రియర్ కెమెరా ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేస్తుందట. అయితే ఈ మొబైల్ యూరప్ మార్కెట్లో లాంచ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ స్మార్ట్ మొబైల్ ఎంట్రీ ఫీచర్లు కూడా అదే విధంగా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ స్మార్ట్ మొబైల్ ఎటువంటి ప్రత్యేకతలను కలిగి వుందో ఒకసారి తెలుసుకుందాం.

NOKIA C-12 SPECKS:
నోకియా C-12వ స్మార్ట్ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే..6.3 అంగుళాల హెచ్డి డిస్ప్లే  తో కలదు. ఈ డిస్ప్లే వాటర్ డ్రాప్ నొచ్ తో లభిస్తుందట. ఇక కెమెరా విషయానికి వస్తే ఇందులో సెల్ఫీ రియల్ కోసం 5 మెగా ఫిక్స్ఎల్ కెమెరా కలదు. ఆక్టోకార్ ప్రాసెస్ తో ఈ మొబైల్ పనిచేస్తుంది. 2 జిబి ర్యామ్ 64 జిబి స్టోరేజ్ కలదు. నోకియా C-12 మొబైల్ ఆండ్రాయిడ్ 12 ,OS పైన పనిచేస్తుంది. ఈ స్మార్ట్ మొబైల్ బ్యాక్ కెమెరా విషయానికి వస్తే 8 మెగా పిక్సెల్ కలదు. బ్యాటరీ విషయానికి వస్తే ..3000 MAH సామర్థ్యం తో పాటు రియూవబుల్ బ్యాటరీ తో వస్తుంది. ఈ మొబైల్ 4G మొబైల్. అలాగే బ్లూటూత్ వైఫై తదితర ఫీచర్లు కలవు.

మరింత సమాచారం తెలుసుకోండి: