వావ్ వావ్ వాట్సాప్ నుంచి ఆ క్వాలిటీ ఫీచర్?

ఇక వాట్సాప్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వాట్సాప్‌ ఎప్పటికప్పుడు అనేక రకాల మార్పులు చేస్తూనే ఉంది. ఇతర కంపెనీల నుంచి పెరుగుతోన్న పోటీనీ తట్టుకునే క్రమంలో, యూజర్లను సరికొత్త ఫీచర్లతో వాట్సాప్ ఎప్పుడూ ఎంతగానో ఆకట్టుకుంటూనే ఉంది.ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే వాట్సాప్‌ వరసపెట్టి ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే మరో ఇంట్రెస్టింగ్ సూపర్ ఫీచర్‌ను కూడా పరిచయం చేసేందుకు వాట్సాప్‌ ఇప్పుడు సిద్ధమైంది. సాధారణంగా వాట్సాప్‌ విషయంలో యూజర్లకు ఉండే ఫిర్యాదుల్లో ఫొటో క్వాలిటీ ఒకటి ఎక్కువగా ఉంటుంది. గ్యాలరీలో ఎంతో క్వాలిటీతో కనిపించే ఫొటో అయినా దానిని ఇతరులకు పంపించగానే ఆ ఫోటో క్లారిటీ దెబ్బకు తగ్గుతుంది.వాట్సాప్ యూజర్లు చాలా మంది ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొనే ఉంటారు. 


తాజాగా ఈ సమస్యకు పూర్తిగా చెక్‌ పెట్టడానికే వాట్సాప్‌ ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఒరిజినల్‌ క్వాలిటీతో ఫొటోలను పంపించేందుకు వీలుగా ఫొటో క్వాలిటీ అనే ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొస్తోంది. ప్రస్తుతం వాట్సాప్‌లో ఇతరులకు షేర్‌ చేసే ఫొటోలు అవతలి వారికి కంప్రెస్డ్ ఇంకా గ్రైనీగా సెండ్‌ అవుతున్నాయి.ఎంత క్వాలిటీ ఉన్నా కూడా ఈ ఇమేజ్‌లు  క్లారిటీ తగ్గి అవతల వారికి సెండ్ అవుతాయి.అయితే ఇక ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్లు తాము పంపుతున్న ఫొటోల క్వాలిటీని చాలా ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2.23.2.11 వాట్సాప్ బీటా అప్‌డేట్‌లో ఈ ఫీచర్‌ను తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం డెవలపింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలో అందరికీ కూడా అందుబాటులోకి తీసుకున్నారు. వాట్సాప్‌ ఈ ఫీచర్‌పై త్వరలోనే ఒక అధికారిక ప్రకటన చేయనుంది. ఇక ఈ ఫీచర్‌  అందుబాటులోకి వస్తే ఇకపై యూజర్లు ఫొటోలను హెడ్‌డీ క్లారిటీలో పంపుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: