హైపర్ ఆది..తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. జబర్దస్త్ అంద‌రి పంచ్‌లు ఓ ఎత్తైతే.. హైపర్ ఆది పంచ్‌లు మరో ఎత్తు. ఆది పంచ్‌లు వింటూ నవ్వుడానికి కాస్త గ్యాప్ కావాలంటారు కామెడీ లవర్స్. అతి త‌క్కువ కాలంలోనే స్టేజ్ కమెడియన్‌గా అసామాన్య ప్రజాదారణ సంపాదించాడు ఆది. అడల్ట్ పంచ్‌లు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేస్తాడన్న పేరున్నా కూడా.. ఈయ‌న‌ కామెడీ స్కిట్‌లకు మాత్రం సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక ఆయన స్కిట్ చేశారంటే ముఖ్యంగా యూట్యూబ్‌లో మిలియన్లలో వ్యూస్ వస్తుంటాయి. 

 

ప్ర‌స్తుతం ఈయ‌న జబర్దస్త్ తో పాటు డీ ఛాంపియనన్స్ లో వర్షినితో క‌లిసి టీమ్ లీడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. బుల్లితెర చరిత్రలో దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద డాన్స్ రియాలిటీ షోగా గుర్తింపు పొందింది ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతున్న `ఢీ`.  మొదటి సీజన్ నుండి కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతూ సాగుతుంది ఈ అల్టిమేట్ డ్యాన్స్ షో. 'ఢీ' ద్వారా శేఖర్, గణేశ్, జానీ, రఘు, యశ్వంత్ ఇలా ఎంతో మంది కొరియోగ్రాఫర్లు తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ప్ర‌స్తుతం సుధీర్ - ర‌ష్మీలో పాటు ఆది - వర్షినిల జోడి ఢీ షోలో చేస్తున్న హడావుడి మాములుగా ఉండ‌డం లేదు.

 

ఇదిలా ఉంటే.. వ‌చ్చే వారం ప్ర‌సారం కాబోయే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతుంది. ఇందులో ఐశ్వర్య అటెంప్ట్ చేసిన సరికొత్త పెర్ఫామెన్స్ లో వాడిన చిన్న హోవర్ బోర్డ్ లాంటి దానితో హైపర్ ఆది చేసిన ఫీట్లు అన్ని ఇన్ని కాదు. అవి కానీ చూస్తే ఏ ఒక్కరికీ నవ్వు రాకుండా మాత్రం ఉండదు.  ఎందుకంటే అంత‌లా హైప‌ర్ ఆది వాటితో విన్యాసాలు చేస్తుంటే.. ప‌క్క‌న  ప్రదీప్ మరియు సుధీర్ లు తెగ నవ్విస్తుంటారు. ఏదేమైనా వ‌చ్చే వారం ఎపిసోడ్ మాత్రం దుమ్ముదులిపేయ‌నుంద‌ని అర్థం అవుతుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: