ఏంటి ? మహేష్ బాబుపై వంటలక్క విజయమా? ఎం మాట్లాడుతున్నారు? వంటలక్క రేంజ్ ఏంటి ? మహేష్ బాబు రేంజ్ ఏంటి ? అని అనుకుంటున్నారా? అలా అనుకోకండి.. ఏ హీరో సూపర్ స్టార్ అయినా.. ఏ హీరో గ్రేట్ అయినా అన్ని వెండితెరపైనే చూసుకోవాలి.. ఎందుకంటే బుల్లితెరపై ఎవరైనా సరే వంటలక్క తర్వాతే. 

 

ఏంటి అంత స్పెషల్? ఆ వంటలక్కకు ఏమైనా కొమ్ములు ఉన్నాయా? అని అనుకుంటున్నారా? కొమ్ములు లేవు కానీ అభిమాన సంఘాలు ఉన్నాయి. చిన్న పిల్లల నుండి ముసిలోళ్ళ వరుకు ప్రతి ఒక్కరు ఆమెకు ఫ్యాన్సే.. ఆ డాక్టర్ బాబు ఈమెను ఎప్పుడు అర్థం చేసుకుంటాడో తెలీదు కానీ ఈమె మాత్రం ఏడుపుతోనే సీరియల్ ని ఓ రేంజ్ లో నడిపిస్తుంది. 

 

ఈ వంటలక్క సీరియల్ వచ్చింది అంటే చాలు అన్ని టీవీలు బంధ్ అవుతాయి.. కేవలం స్టార్ మా మాత్రమే ఉంటుంది. అందుకే రేటింగ్స్ అన్ని ఛానెల్స్ కంటే కూడా ఈ స్టార్ మా నే ఫస్ట్ ఉంటుంది. అలాంటి స్టార్ మా ఇప్పుడు పడిపోయింది.. ఎందుకంటే ఈ కరోనా వల్ల సీరియల్స్ ఆగిపోయాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే జెమినీ పుంజుకుంది. 

 

నిజానికి జెమినీ టీవీ కూడా సీరియల్స్ కొట్టాలి అని అనుకున్నప్పటికీ.. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పట్టికి స్టార్ మా'పై విజయసాదించలేకపోయింది. అయితే నిజానికి స్టార్ మా ను సీరియల్ తో కొట్టకపోయినప్పటికీ సినిమాతో హిట్ కొట్టింది. మహేష్ బాబు పుణ్యమా అని కనువిను ఎరగని రీతిలో జెమినీ టీవీ టాప్ వచ్చింది.. వంటలక్కను దాటేసింది. వంటలక్క ఎప్పుడు 18, 19 రేటింగ్ తీసుకొస్తే మహేష్ బాబు ఏకంగా సరిలేరు నీకెవ్వరూతో ఏకంగా 23.4 రేటింగ్ తో ఒక్కసారిగా దూసుకుపోయింది అంటే నమ్మండి. ఇలా స్టార్ మా పై.. జెమినీ టీవీ విజయం సాధిస్తే వంటలక్కపై మహేష్ బాబు విజయం సాధించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: