ఒక పెద్దింటి అమ్మాయి.. ఓ అందమైన పేద కుటుంబం.. పెద్ద కుటుంబం. పెద్దింటి అమ్మాయికి తల్లి లేకపోవడంతో తండ్రి అతి గారాబం చేసి కూతురుకి పద్ధతులు ఏమి తెలీకుండా పెంచుతాడు. ఇంకా ఆ అమ్మాయి విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తుంటుంది అంటే నమ్మండి.. ఒక అబ్బాయిని లవ్ చేసి మోసపోతుంది. 

 

ఇతి తెలియని తండ్రి.. ఆస్తిలో, అందంలో కంటే కూడా గుణంలో ఐశ్వర్యవంతుడైన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చెయ్యాలి అనుకుంటాడు. అప్పుడే యాక్సిడెంటల్ గా వీరు ఇద్దరు కలుస్తారు.. కలిసిన మొదటి సరే ఆ అబ్బాయితో పాటు అతని కుటుంబం నచ్చి అతనికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అయితే ఎప్పుడు విలాసవంతమైన భవనాల్లో నివసించి.. రిచ్ లైఫ్ ని అనుభవించిన అమ్మాయి అత్తారింట్లో ఎలా ఉంటుంది అనేదే కథ.. 

 

మనకు ఈ లైన్ తెలిసినప్పటికీ ఆ సీరియల్ లో ఒకొక్క భాగం చాలాబాగుంటుంది.. అన్ని సీరియల్స్ లాగా ఎప్పుడు ఏడుపులా కాకుండా కామెడీ ఎక్కువగా ఉండి.. అప్పుడప్పుడు ఎమోషన్స్ తో సీరియల్ సూపర్ గా ఉంటుంది. ఇంకా ఈ సీరియల్ లో అత్త పాత్ర ఒక అద్భుతం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సీరియల్ లో అత్త కుటంబాన్ని అందంగా ఆనందంగా ఎలా తీర్చి దిద్దాలు అనేది అద్భుతంగా చూపించారు. అప్పట్లో ఈ సీరియల్ సూపర్ హిట్.. 

మరింత సమాచారం తెలుసుకోండి: